దారుణం: పెళ్ళికి ఒప్పుకోలేదని యువతిపై అత్యాచారం

Man held for raping his domestic help in Lucknow
Highlights

పనిమనిషిపై అత్యాచారం


లక్నో: పని మనిషిని కత్తితో బెదిరించి యజమాని కొడుకు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు నిద్రలోకి జారుకొన్న తర్వాత బాధితురాలు అక్కడి నుండి తప్పించుకొని పారిపోయింది.పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో మహానగర్ లో విగ్యాణ్‌పురి రెసిడెన్సిలో   లవ్ శర్మ  తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్నాడు. లవ్ శర్మ తల్లి మరణించింది. దీంతో వంట పనిచేసేందుకే 24 ఏళ్ళ యువతిని నియమించుకొన్నారు.

లవ్ శర్మకు వివాహం కాకపోవడంతో తమ ఇంట్లో పనిచేసే యువతిని తనను పెళ్ళి చేసుకోమని వేధింపులకు పాల్పడేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. లవ్ శర్మ ప్రవర్తనతో ఆ యువతి విసిగిపోయింది. లవ్ శర్మను పెళ్ళి చేసుకొనేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష తీర్చుకోవాలని ఆయన భావించాడు.

జూన్ 13వ తేది సాయంత్రం వంట చేసేందుకు ఆ యువతి లవ్ శర్మ ఇంటికి వచ్చింది. అయితే ఆ రోజు ఉదయమే లవ్ శర్మ తండ్రి  వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లవ్ శర్మ భావించాడు. వంట చేసేందుకు వచ్చిన యువతిని బెదిరించాడు. గొంతుపై కత్తి పెట్టి ఆమెపై ఆ రాత్రిపూట పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

తెల్లవారుజామున లవ్ శర్మ నిద్రపోతుండగా ఆ యువతి అక్కడి నుండి పారిపోయి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. లవ్ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader