స్నేహితుడి భార్యను వివాహేతర సంబంధం పేరుతో లొంగదీసుకుని.. ఆమెతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసి వాటిని సామాజి మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడో వ్యక్తి .

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేశ్ సెకండ్ హ్యాండ్ బైకులను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో పంచమూర్తికి చెందిన ఓ సైనికుడు రమేశ్ వద్ద ఓ బైక్‌ను కొన్నాడు. దీంతో వారిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రమేశ్ తరచూ సైనికుడి ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు.

ఈ సమయంలో అతని భార్యతో రమేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. సైనికుడు ఇంట్లో లేని సమయంలో వీరిద్దరూ ఏకాంతంగా గడిపేవారు. అయితే సైనికుని భార్యకు తెలియకుండా ఆమె నగ్న దృశ్యాలను రమేశ్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

ఓ రోజు ఆ వీడియోను చూసిన రమేశ్ భార్య దిగ్భ్రాంతికి చెందడంతో అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. సైనికుడు కూడా వీడియోలు చూడటంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై సైనికుడి భార్య పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయకపోవడంతో రమేశ్‌ను మందలించి వదిలివేశారు.