Asianet News TeluguAsianet News Telugu

నగ్న వీడియోలు పంపి పురుషుడికి వల: షాకిచ్చిన మహిళ

పురుషుడి నగ్న వీడియోను సేకరించి అతడి నుండి డబ్బులు వసూలు చేసింది ఓ మహిళ. డబ్బుల కోసం ఆమె నుండి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.

man cheated by woman in benguluru
Author
Bengaluru, First Published Jun 25, 2020, 9:22 PM IST


బెంగుళూరు: పురుషుడి నగ్న వీడియోను సేకరించి అతడి నుండి డబ్బులు వసూలు చేసింది ఓ మహిళ. డబ్బుల కోసం ఆమె నుండి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.

ఫేస్ బుక్ లో గుర్తు తెలియని మహిళతో స్నేహం చేసిన ఓ వ్యక్తి మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. బెంగుళూరు సుల్తాన్ పాళ్యకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఫేస్ బుక్ లో ఓ మహిళతో స్నేహం చేశాడు. ఈ స్నేహం ఆధారంగా వీరిద్దరూ తరచూ చాటింగ్ చేసేవారు.

వీరిద్దరూ కూడ ఫోన్ నెంబర్లు మార్చుకొన్నారు. ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఆమె వీడియో కాల్ చేసిన తాను నగ్నంగా కన్పించింది. అంతేకాదు అతడిని కూడ నగ్నంగా తనకు వీడియో కాల్ చేయాలని కోరింది.  

ఆమె చెప్పినట్టుగానే అతను  ఆమెకు నగ్నంగా ఫోన్ చేశాడు. ఆ దృశ్యాలను ఆమె రికార్డు చేసింది.  అతను ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికి ఆమె మరోసారి ఫోన్ చేసింది. నీ ప్రైవేట్ దృశ్యాలు తన వద్ద ఉన్నాయన్నారు. తాను చెప్పినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది. 

దీంతో భయపడిన అతను ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ. 10 వేలు జమ చేశాడు. ఇలాగే పదేపదే డబ్బులు ఇవ్వాలని ఆమె బెదిరించింది. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక అతను బెంగుళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios