Asianet News TeluguAsianet News Telugu

నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతా... 100 మంది మహిళలను బ్లాక్ మెయిల్.. చివరికి...

మహిళల ఫొటోలను మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి.. ఆ తరువాత వాటిని మార్ఫ్‌ చేసి.. ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ వసూలు చేస్తోన్నాడో వ్యక్తి. 

Man Arrested For Blackmailing 100 Women Using Fake Nude Pictures - bsb
Author
Hyderabad, First Published Dec 30, 2020, 2:00 PM IST

మహిళల ఫొటోలను మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి.. ఆ తరువాత వాటిని మార్ఫ్‌ చేసి.. ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ వసూలు చేస్తోన్నాడో వ్యక్తి. 

నోయిడాకు చెందిన సుమిత్‌ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి వారి ప్రొఫైల్‌ పిక్చర్స్‌ డౌన్‌లోడ్‌ చేసి వాటిని మార్ఫ్‌ చేసేవాడు. తర్వాత సేమ్‌ సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి.. ఆ ఫోటోలను ఆ మహిళలకే పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. 

ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఇలాగే బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి తెలిసింది. 

ఈ సందర్భంగా ఓ పోలీసాఫీసర్‌ మాట్లాడుతూ.. ‘నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం వాట్సాప్‌ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్‌ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. ఇక సదరు బ్యాంక్‌ ఎంప్లాయ్‌ ఫిర్యాదుతో సర్వీస్‌ ప్రొవైడర్‌ రిపోర్ట్‌, సీక్రెట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సేకరించి నిందితుడిని గుర్తించగలిగాము. మంగళవారం అతడిని అరెస్ట్‌ చేశాం ’ అని తెలిపారు. ఇక నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్‌, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios