Asianet News TeluguAsianet News Telugu

బాలికలతో నగ్న నృత్యాలు.. పోలీసుల కీచక పర్వం...

బాలికలను బెదిరించి... బలవంతంగా దుస్తులు విప్పించి.. అసభ్య నృత్యాలను చేయించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

Maharashtra Girls stripped, forced to dance by cops at hostel in Jalgaon; probe ordered
Author
Hyderabad, First Published Mar 4, 2021, 7:52 AM IST

ఆపదలో ఉన్న ఆడపిల్లలను కాపాడాల్సిన గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్న పోలీసులే దారుణంగా ప్రవర్తించారు. కాపాడాల్సినవారే కామాంధులుగా ప్రవర్తించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ని జలగావ్ ప్రభుత్వ నిర్వహణనలో ఉన్న మహిళ, శిశు సంరక్షణ వసతి గృహంలో చోటుచేసుకున్నాయి.

కొందరు బయటి వ్యక్తులు, పోలీసులు వసతి గృహానికి వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలికలను బెదిరించి... బలవంతంగా దుస్తులు విప్పించి.. అసభ్య నృత్యాలను చేయించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, బాధిత బాలికలు మంగళవారం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. చిఖ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే బుధవారం ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడితే సమాజానికి దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ దర్యాప్తునకు ఆదేశించారు. నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కూటమి రెండు రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios