16ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత తన భార్య తనతో సెక్స్ కి అంగీకరించడం లేదని ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.  కాగా.. కోర్టు అతనికి చివాట్లు పెట్టి.. అందులో మీ భార్య తప్పు ఏమీలేదని తీర్పు ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి 1988లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా.. వారికో కూతురు కూడా ఉంది. వివాహం జరిగిన 16ఏళ్ల తర్వాత కూడా.. తన సెక్స్ కోరికలు తీర్చాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసును పరిశీలించిన మద్రాసు హైకోర్టు.. సదరు భర్తకు చివాట్లు పెట్టింది. అతని భార్య చేసిన దాంట్లో తమకు ఎలాంటి క్రూయాలిటీ కనిపించడం లేదని కోర్టు తెలిపింది. వయసు పెరుగుతున్న కొద్దీ.. కోరికలు తగ్గడం సహజమని.. దానికి ఎవరినీ నిందించలేమని తెలిపింది. విడాకులు ఇవ్వడానికి కూడా న్యాయస్థానం అంగీకరించలేదు.