'సంపద 2.O' మొబైల్ యాప్ : ఇక ఇంట్లో కూర్చునే ఆస్తుల రిజిస్ట్రేషన్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంపద 2.0 పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. వీటి ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగమైన ఈ ఆవిష్కరణ చేపట్టి పౌరులకు ఆస్తి లావాదేవీలను సులభతరం చేస్తుంది.

Madhya Pradesh Launches Sampada 2.0 for Streamlined Property Transactions AKP

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా మిషన్ సామాన్య ప్రజల అవసరాలను తీరుస్తోందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పేర్కొన్నారు. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఆన్‌లైన్ లావాదేవీలు, ఇ-రిజిస్ట్రీ వంటి ఆవిష్కరణలు సామాన్యుల జీవితాన్ని సులభతరం చేశాయన్నారు. కొత్త సాంకేతికత ఆధారంగా రూపొందించిన "సంపద 2.0" ఆన్‌లైన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎంపి సీఎం అభిప్రాయపడ్డారు.

గతంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది... కానీ ఇప్పుడు ఈ పోర్టల్, యాప్ ద్వారా ఇంటి నుంచే ఈ సౌకర్యాన్ని పొందవచ్చని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.  కుషాభౌ ఠాక్రే అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఇ-రిజిస్ట్రీ, ఇ-రిజిస్ట్రేషన్ కొత్త వ్యవస్థపై అభివృద్ధి చేసిన "సంపద 2.0" పోర్టల్, మొబైల్ యాప్ లను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీటి ఉపయోగాలను ఆయన వివరించారు. 

ఈ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫారమ్స్ ఆస్తి లావాదేవీలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని క్రమబద్ధీకరిస్తుందని అన్నారు. ఇది రాష్ట్ర రిజిస్ట్రేషన్ వ్యవస్థలో గేమ్ చేంజర్‌గా సీఎం మోహన్ యాదవ్ అభివర్ణించారు. 

 

ఈ అప్‌గ్రేడ్ చేసిన వ్యవస్థ సరళంగా వుండి సమర్థవంతంగా పనిచేస్తుందని... ఎక్కడా అవినీతికి ఆస్కారం వుండదని సీఎం తెలిపారు. "సంపద-2.0" వ్యవస్థ రాష్ట్రంలో వుండేవారికే  కాదు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో వుండువారు కూడా సులభంగా ఆన్‌లైన్ లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోనేలా రూపొందించబడిందని అన్నారు. ఈ ఆవిష్కరణ పౌరుల సమయాన్ని ఆదా చేయడమే రిజిస్ట్రేషన్ సయయంలో విధింంచే అనవసరమైన రుసుములను తగ్గిస్తుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు రెండు ముఖ్యమైన పనులను అప్పగించిందని డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు: సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద ఐటీ ద్వారా 120 నగరాల జిఐఎస్ పనిని పూర్తి చేయడం, అన్ని జిల్లాల్లో జిఐఎస్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం. ఐటీలో మధ్యప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని... పేపర్‌లెస్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తుందని ఆయన అన్నారు.

"సంపద 2.0" గురించి హైలైట్ చేస్తూ.... ఇది ఆధునిక సాంకేతికతపై ఆధారపడి ఉందని, GST, యూనిక్ ఐడితో పాటు రెవెన్యూ, ఫైనాన్స్, పట్టణ పరిపాలన విభాగాలతో అనుసంధానించబడి ఉందని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ ఆస్తి GIS మ్యాపింగ్, బయోమెట్రిక్ గురించి, డాక్యుమెంట్ ఫార్మాటింగ్‌కు సహాయపడుతుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు, ఇంటి నుంచే డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దరఖాస్తుదారులు వాట్సాప్, ఇమెయిల్ ద్వారా డాక్యుమెంట్ యొక్క సాఫ్ట్ కాపీని అందుకుంటారు.

ప్రధానమంత్రి మోడీ మార్గదర్శకత్వంలో రాష్ట్రం నిరంతరం ఆవిష్కరణలు చేస్తోంది. జీవన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంపద 2.0 అమలు చేయబడుతోందని సీఎం తెలిపారు. ఇది రిజిస్ట్రేషన్ వ్యవస్థను సులభతరం, సరళంగా, అవినీతి రహితంగా చేస్తుందన్నారు. ఇ-రిజిస్ట్రేషన్, ఇ-స్టాంపింగ్ కొత్త వ్యవస్థ ద్వారా పౌరులు ప్రయోజనం పొందుతారు, వారు తమ ఆస్తిని ఇంటి నుంచే అమ్మకం, రిజిస్టర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ వ్యవస్థ రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం వెలుపల, దేశం నుండి కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తుంది, సమయాన్ని ఆదా చేస్తుంది, అనవసరమైన ఆరోపణలను నివారిస్తుందని ఎంపి సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. 

 "సంపద 2.0" ద్వారా ప్రయోజనం పొందిన పౌరులతో డాక్టర్ యాదవ్ వర్చువల్‌గా సంభాషించారు. హాంకాంగ్ నుండి సురేంద్ర సింగ్ చక్రత్ మాట్లాడుతూ... తాను నివాసముండే దేశంనుండే రత్లాంలో "పవర్ ఆఫ్ అటార్నీ" డాక్యుమెంట్‌ను నమోదు చేశానని తెలియజేశారు. అదేవిధంగా జబల్పూర్‌లో జన్మించి ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న 78 ఏళ్ల డాక్టర్ శక్తి మాలిక్ కూడా "పవర్ ఆఫ్ అటార్నీ" డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ కొత్త వ్యవస్థపై డాక్టర్ మాలిక్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

స్పెయిన్‌లో జరగనిది మధ్యప్రదేశ్‌లో జరిగింది:  మరియానో మాటియాస్

స్పెయిన్‌లో ఇంకా ఇ-రిజిస్ట్రీ అమలు కాలేదని అక్కడ నివాసముంటున్న మరియానో మాటియాస్ పేర్కొన్నారు. ఈ ఘనత సాధించినందుకు సీఎం యాదవ్, ఆయన బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

 డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రమని ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా పేర్కొన్నారు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందాన్ని అభినందించారు. సీఎం యాదవ్ మార్గదర్శకత్వంలో "సంపద 2.0"ను సులభతరం చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో వేగంగా మార్పులు చేసినట్లు తెలిపారు. తన పౌరుల కోసం పారదర్శకమైన ఆన్‌లైన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని కొనియాడారు. 4 జిల్లాల్లో విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్‌ల తర్వాత దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేపర్‌లెస్ ప్రక్రియ లోపాలకు ఆస్కారం లేకుండా చేస్తుందని.... మొబైల్ యాప్ ఏదైనా లొకేషన్‌కు మార్గదర్శక రేట్లను తక్షణమే యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ఇదిలావుంటే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో అత్యుత్తమ పనితీరుకు కనబర్చిన వారికి  సీఎం యాదవ్ సత్కరించారు. "సంపద 2.0" పోర్టల్, యాప్ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. వాణిజ్య పన్ను శాఖ నుండి స్మారక చిహ్నంగా శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని కూడా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అందుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios