Asianet News TeluguAsianet News Telugu

మహిళల న్యూడ్ ఫొటోలు, వీడియోలతో ఢిల్లీ వ్యక్తి బ్లాక్ మెయిల్ క్రీడ

ఢిల్లీ యువకుడు ఓకతను టాక్ లైఫ్ మొబైల్ యాప్ ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి న్యూడ్ ఫొటోలు, వీడియోలు తెప్పించుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు.

Luring women into sending nude photos, videos, Delhi man arrested
Author
Delhi, First Published Jul 23, 2021, 8:07 AM IST

న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలకు డబ్బులు ఇచ్చి వారి నుంచి న్యూడ్ ఫొటోలను, వీడియోలను తెప్పించుకుంటున్న 21 ఏళ్ల యువకుడు పోలీసుల చేతికి చిక్కాడు. తొలుత డబ్బులు ఇచ్చిన ఆ యువకుడు ఆ తర్వాత వాటిని లీక్ చేస్తానని బెదిరించి మరిన్ని న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపించాలని అడిగాడు. అలా బ్లాక్ మెయిల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

జతిన్ భరద్వాజ్ అనే యువకుడు డిప్రెషన్ లోకి వెళ్లిన మహిళలను, ఆర్థికంగా తీవ్రమైన చిక్కుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని టాక్ లైఫ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వారి నుంచి వీడియోలను, ఫొటోలను తెప్పించుకుంటూ వస్తున్నాడు. అలా 15 మంది మహిళలను అతను వలలో వేసుకున్నాడు. వారిలో ముగ్గురి నుంచి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తెప్పించుకున్నాడు. 

టాక్ ఫైల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అతనికి పరిచయమైన ఇండోనేషియా మహిళ ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి తగిన సమచారాన్ని తాము సేకరించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్. సతియసుందరం చెప్పారు. 

ఆ తర్వాత నిందితుడు తన ఫోన్ ను స్విఛాఫ్ చేశాడు. కాల్ డిటైల్స్ ఆధారంగా, మొబైల్ యాజమాన్యం ఆధారంగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల సమాచారం ఉన్న మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios