Asianet News TeluguAsianet News Telugu

ఆఫర్ ఇప్పిస్తానంటూ మోడల్ కు మత్తుమందిచ్చి.. నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్...

 స్క్రీన్ టెస్ట్ కు రావాలి అంటూ ఆమెను guesthouseకు పిలిపించారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.  ఆ తర్వాత ఓ డ్రెస్ ఇచ్చి Changing room కి వెళ్లి మార్చుకోవాలని చెప్పారు. అక్కడ ఆమె దుస్తులు మార్చుకుంటుంటే వారు రహస్యంగా చిత్రీకరించారు. 

Lucknow : Woman sedated, filmed nude; 6 booked
Author
Hyderabad, First Published Oct 25, 2021, 10:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మహిళల్ని నమ్మించి మోసం చేయడమే కాకుండా.. వారి నగ్నఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. 

ఆ నిందితులు అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేక అలాగని వారి బారిన పడి.. వారు చెప్పిన దారుణాలన్నీ చేయలేక.. మానసిక ఒత్తిడితో అసువులు బాస్తున్న వారు చాలామందే కనిపిస్తున్నారు. అలాంటి దారుణమైన ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. వర్ధమాన మోడల్ కు మత్తు మందు ఇచ్చిన ఓ మహిళ ఆమెను నగ్నంగా చేసి ఫోటోలు, వీడియోలు తీసి ఆపై వాటిని  చూపించి బ్లాక్ మెయిల్ కు దిగింది. రూ.5 లక్షలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తామని లేదంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగింది.

విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. మోడల్ ను Screen testకు  పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన Victim  ఐదు లక్షలు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను 
Social mediaలో అప్లోడ్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపించింది.

వైష్ణవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ తో పాటు పలు  సినిమాలు, modeling అవకాశాలు ఇప్పిస్తానంటూ దియా వర్మ అనే మహిళ బాధితురాలిని కలిసింది.  తన మాయ మాటలు నమ్మిన  బాధితురాలిని తీసుకు వెళ్లిన దియా..  అనూప్ ఓఝా, వరుణ్ తివారి,  ఆయుష్ మిశ్రా,  ప్రియా మిశ్రా,  సందీప్ విశ్వకర్మ లను తన సహచరులుగా చెబుతూ పరిచయం చేసింది. 

ఆ తరువాత స్క్రీన్ టెస్ట్ కు రావాలి అంటూ ఆమెను guesthouseకు పిలిపించారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.  ఆ తర్వాత ఓ డ్రెస్ ఇచ్చి Changing room కి వెళ్లి మార్చుకోవాలని చెప్పారు.  

దియాను ఆమె ఫ్రెండ్స్ ను అమాయకంగా నమ్మిన ఆ మోడల్ కు వారిమీద ఏ కాస్త అనుమానం కూడా రాలేదు. దీంతో డ్రెస్ మార్చుకోవడానికి వారు చెప్పిన గదిలోకి వెళ్లింది. అప్పటికే కూల్ డ్రింక్ లోని మత్తు తలకు మెల్లిమెల్లిగా ఎక్కుతుండడంతో.. అసలేం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో పడిపోయింది.

భార్యను 15యేళ్లుగా వేధిస్తూ, అబార్షన్ మీద అబార్షన్లు చేయిస్తూ.. చివరికి విషం తాగించి.. ఓ భర్త పైశాచికత్వం.. 

అలా, అక్కడ ఆమె దుస్తులు మార్చుకుంటుంటే వారు రహస్యంగా చిత్రీకరించారు. తర్వాత ఆ nude video చూపించి అసభ్యకర చిత్రాల్లో నటించాలని, లేకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. దీనికి నిరాకరించిన ఆమె ఆ వీడియోను డిలీట్ చేయాలని కోరింది.

అయితే ఐదు లక్షలు ఇస్తేనే వాటిని డిలీట్ చేస్తామన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ వీడియోను ఇంటర్నెట్లోకి అప్ లోడ్ చేశారని పేర్కొంది. అప్పటి నుంచి వారు తనను డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించింది.  నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios