తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ తెలిపారు. గత కొంతకాలంగా కన్యాకుమారి పార్లమెంట్ స్థానానికి ఆమె పోటీచేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా.. ఆ వార్తలపై ఆమె స్పందించారు.

కన్యా కుమారి పార్లమెంటు స్థానానికి తాను పోటీచేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. కన్నియ కుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మరణంతో ఖాళీయైన ఆ స్థానానికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమవుతున్నాయి.

 ఈ క్రమంలో, కన్నియకుమారి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి ఖుష్బూ పోటీ చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై ఖుష్బూను విలేకరులు ప్రశ్నించగా, ఎన్నికలు జరిగే ప్రతిసారి తన గురించి ఇలాంటి కథనాలు రావడం సహజంగా మారిందన్నారు. ఎంపీ వసంత్‌ కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.