కుమారస్వామి ప్రమాణం: చేతులు కలిపిన రాహుల్, చంద్రబాబు

Kumaraswamy swear- in ceremony: Rahul Gandhi shakes hand with Rahul Gandhi
Highlights

ర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్మరాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. 

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్మరాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బిజెపియేతర పార్టీల నేతలంతా వేదికపై నుంచి అభివాదం చేస్తూ ఐక్యతను చాటారు. 

బిఎస్పీ నేత మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేదికపై తొలుత పక్కపక్కనే నించుని మిగతా పార్టీల నాయకులను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ పక్కనే నిలబడ్డారు. 

కొద్ది క్షణాల్లో రాహుల్ గాంధీ మమతా బెనర్జీ పక్కన రాహుల్ గాంధీకి చంద్రబాబు చోటు ఇచ్చారు. సోనియా గాంధీ మాయావతి వక్కన నిలబడ్డారు. మిగతా పార్టీల నాయకులు కూడా వేదికపైన వరుసగా నిలబడి అభివాదం చేశారు.

ఆ తర్వాత రాహుల్ గాంధీ చంద్రబాబుతో కరచాలనం చేయడం కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం ఒక రోజు ముందే బెంగళూరు వచ్చి కుమారస్వామిని అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన రాలేదు.  

మాయావతి, అఖిలేష్ యాదవ్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఇద్దరు కలిసి వేదికపై నుంచి అభివాదాలు తెలియజేశారు. వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నారు. మాయావతి సోనియా గాంధీతో అత్యంత సన్నిహితంగా వచ్చి పరస్పరం ముచ్చటించుకున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ రాహుల్ గాంధీ చిరునవ్వులు చిందించడం కనిపించింది. 

loader