Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని ఫిట్ నెస్ చాలెంజ్ కు కర్ణాటక సీఎం కుమారస్వామి కౌంటర్ ట్వీట్

నేను ఫిట్ గానే ఉన్నా...కాని రాష్ట్రం లేదన్న కుమార స్వామి

Kumaraswamy responds to PM Modi fitness challenge

దేశంలో ఇపుడు ''ఫిట్ నెస్ చాలెంజ్'' యుగం కొనసాగుతోంది. సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు ఈ ఫిట్ నెస్ చాలెంజ్ విసురుకుంటున్నారు. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ అన్న నినాదంతో దేశం మొత్తం ఫిట్ గా ఉండేందుకు ఈ చాలెంజ్ కొనసాగుతోంది. అయితే ఈ ఫాట్ నెస్ చాలెంజ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆయన దీన్ని స్వీకరించి ప్రధాని మోదీ కి చాలెంజ్ విసిరారు. దీంతో కొహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను ఇవాళ పోస్ట్‌ చేశారు. 

ఉదయం వేళ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ.. ప్రకృతితో  తాను మమేకం అవుతూ ప్రేరణ పొందుతానని సోషల్‌ మీడియాలో మోదీ తెలిపారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, రోజూ ఇలా శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు. తర్వాత ఆయన కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, క్రీడాకారిణి మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లు పైబడిన ఐపీఎస్‌ అధికారులు ఈ  ఛాలెంజ్‌ స్వీకరించాలని ఆహ్వానించారు.  

అయితే ఈ చాలెంజ్ కు కర్ణాటక సీఎం కుమారస్వామి ట్విట్టర్ ద్వారా ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. తనను ఈ ఫిట్ నెస్ చాలెంజ్ భాగస్వామ్యం చేసి తన ఆరోగ్యం గురించి పట్టించుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే తాను రోజు యోగా తో పాటు ట్రెడ్ మిల్ చేస్తానని, అందువల్ల చాలా ఫిట్ ఉన్నానని ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. అయితే తాను రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించే  ఆందోళన చెందుతున్నట్లు తెలిపాడు. అందువల్ల తమ రాష్ట్రానికి ప్రధానిగా మీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సాయం కావాలంటూ కుమార స్వామి ట్వీట్ చేశారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios