ఓ యువతిపై స్నేహితుడే దారుణానికి పాల్పడ్డాడు. నమ్మించి కారులో తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కారులో నుంచి కిందకు తోసేశాడు. కాగా.. యువతి అరుపులు విన్న ఓ మహిళ.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించింది. కారు ఆపడానికి ప్రయత్నించిన మహిళపై కూడా సదరు వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమను కారుతో తొక్కించి మరీ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్ కతాలోని ఆనందపూర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లింది. కాగా.. కదిలో కారులోనే యువకుడు.. సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... అతని బారి నుంచి బయటపడేందుకు యువతి గట్టిగా కేకలు వేసింది.

కాగా.. ఆ అరుపులు అటుుగా వెళ్తున్న ఓ దంపతులు విన్నారు. వెంటనే కారును ఆపి  యువతిని కాపాడాలని భావించారు. అయితే.. ఆ వ్యక్తి మాత్రం మరింత దారుణంగా ప్రవర్తించాడు. కారు ఆపాలని చూసిన మహిళను ఢీ కొట్టి అంతకంటే వేగంగా అక్కడి నుంచి వెళ్లాడు.  అనంతరం కారులో ఉన్న యువతి అందులో నుంచి తోసేసాడు.

కాగా.. యువతిని కాపాడే క్రమంలో గాయాలపాలైన మహిళను ఆమె భర్త ఆస్పత్రిలో చేర్పించాడు. తొలుత.. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ కూడా ముందుకు రాలేదని ఆమె భర్త వాపోయాడు. కరోనా భయంతో ఒక్క అంబులెన్స్ కూడా ముందుకు రాలేదని చెప్పాడు. తర్వాత పోలీసుల సహాయంతో.. ఆస్పత్రికి చేర్పించానని చెప్పాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కాగా.. సదరు బాధిత యువతికి కూడా చికిత్స అందించి ఇంటికి పంపినట్లు వారు చెప్పారు.