ఔరంగజేబును తూట్లు తూట్లు పొడిచారు

First Published 15, Jun 2018, 3:47 PM IST
kidnaped Army jawan found dead
Highlights

ఔరంగజేబును తూట్లు తూట్లు పొడిచారు

ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కశ్మీర్‌లో నిన్న అపహరించుకుపోయిన  జవానును అత్యంత పాశవికంగా హతమార్చారు.. సోఫియాన్‌లోని షాదిమార్గ్‌ వద్ద ఉన్న 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో సైనికుడిగా పనిచేస్తున్న ఔరంగజేబు అనే జవాను రంజాన్ పర్వదినం కావడంతో సెలవుపై తన స్వగ్రామానికి బయలుదేరాడు.. అయితే అతన్ని మార్గమధ్యంలో చుట్టుముట్టిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

సైనికుడిని తీవ్రవాదులు అపహరించుకుపోయారని తెలుసుకున్న భారత సైన్యం, బీఎస్ఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కలంపోరకు సమీపంలోని గుస్సూ గ్రామంలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు.

అతని తల, మెడ భాగం మొత్తం బుల్లెట్లతో దించి.. శరీరం మొత్తాన్ని జల్లెడగా మార్చి అత్యంత కిరాతంగా ఔరంగజేబును చంపారు. గత నెలలో కరడుగట్టిన హిజ్బుల్ ఉగ్రవాదది సమీర్ టైగర్‌ను ఎన్‌కౌంటర్ చేసిన సైనికులలో ఔరంగజేబు క్రియాశీలకంగా ఉండటంతో.. అందుకు ప్రతీకారంగా జవానును చంపారని ఆర్మీ భావిస్తోంది. తమ సహచరుడి మృతితో భారత సైన్యం రగిలిపోతోంది. దెబ్బకు దెబ్బ తీస్తామని పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను హెచ్చరించింది. 

loader