మలయాళ నటిపై లైంగిక దాడి కేసును ట్రయల్స్ కోర్టునుండి కేరళ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ బాధితురాలైన నటి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
2017 లో కేరళలోని ఎర్నాకుళంలో కిడ్నాప్,  లైంగిక వేధింపుల కేసు ఎర్నాకుళంలోని ట్రయల్ కోర్టులో విచారణలో ఉంది. విచారణ సమయంలో కోర్టు పక్షపాత ధోరణి, శత్రు వైఖరితో తాను బాధపడ్డానని ఆమె చెప్పారు.

చాలాసార్లు ప్రాసిక్యూషన్ ఏం చెబుతున్నాడో వినబడలేదని, మరి కొన్నిసార్లు కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుందని అన్నారామె. అంతేకాదు తాను పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ నా సాక్ష్యాలను రికార్డ్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించింది. 

ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మీడియా కవరేజీపై తీవ్రమైన ఆంక్షలున్నాయని, విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేయాలని ఉందని ఆమె అన్నారు. అయితే ఈ రెండు విషయాల్లోనూ కోర్టు పూర్తిగా విఫలమైందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2017 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు.

ఫిబ్రవరి 17న నటి కారు డ్రైవర్ మార్టిన్ ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని రంగంలోకి దిగాడు. పల్సర్‌ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. సహకరించకపోతే చంపుతామని బెదిరించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు.

ఈ కేసులు మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి, వేధించేందుకు ఆయన కుట్ర పన్నారనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి.  ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌, నాదిర్ షాను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

ఈ కేసుపై కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయాలని ఆయన చేసిన పిటిషన్‌ను 2018 డిసెంబర్‌లో కేరళ హైకోర్టు కొట్టివేసింది. తనను తప్పుగా ఇరికించారని వాదిస్తూ నటుడు సిబిఐ దర్యాప్తును కోరాడు. జనవరి 2020 లో, సుప్రీంకోర్టు దిలీప్‌పై విచారణను కొనసాగించడానికి నిరాకరించింది, అయితే అతని పేరు నిందితుల జాబితా నుండి తొలగించాలని కోరుతూ అతని డిశ్చార్జ్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది.