Asianet News TeluguAsianet News Telugu

కేరళ సీరియల్ కిల్లర్ సైనేడ్ జాలీ ఆత్మహత్యాయత్నం

ఆస్తి కోసం సైనేడ్ ఉపయోగించి ఆరుగురు సొంత కుటుంబసభ్యులను చంపినజాలీ జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Kerala serial killer Jolly Shaju suicide attempted in jail
Author
Kojikode, First Published Feb 27, 2020, 2:38 PM IST

ఆస్తి కోసం సైనేడ్ ఉపయోగించి ఆరుగురు సొంత కుటుంబసభ్యులను చంపినజాలీ జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్న జాలీ గురువారం తెల్లవారుజామున పదునైన వస్తువుతో మణికొట్టు నరాన్ని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించింది.

అయితే ఆమెతో పాటు ఉంటున్న ముగ్గురు ఖైదీలు ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు. దీంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కోజికోడ్ మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి అపాయం లేదని అధికారులు తెలిపారు.

Also Read:ఆ మిస్టరీ మహిళ ఎవరు: జాలీతో కలిసి ఫొటో, ఆ తర్వాత మాయం

కాగా.. ఆస్తిని చేజిక్కించుకోవడానికి 14 సంవత్సరాల వ్యవధిలో భర్త థామస్, ఆయన తల్లిదండ్రులు సహా అదే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురిని జాలీ సైనెడ్ ద్వారా హతమార్చింది.

కేరళతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరణించిన వారి మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులు బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తిని సొంతం చేసుకోవడానికి తానే వీరిందరిని హతమార్చినట్లు జాలీ అంగీకరించింది.

ఈ కేసులో సైనేడ్‌ను సరఫరా చేసి నిందితురాలికి సహకరించిన ఎంఎస్ మాథ్యూస్, పి. ప్రాజీకుమార్‌లను కూడా గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు విచారణ సమయంలో జాలీ ఒక సైకో అని, ఆమెకు ఆడపిల్లలంటే అస్సలు పడదని అనేక వార్తలు బయటకొచ్చాయి.

ఇప్పటికే ఆరు హత్యలు, మరోఇద్దరి హత్యకు ప్లాన్: జాలీ సైకోనా?

ఆ ద్వేషంతోనే మొదటి భర్త రాయ్ థామస్ సోదరి కుమార్తె ఆల్పైన్‌‌ను హత మార్చినట్లు సిట్ బృందం తెలిపింది. మొత్తం ఆరుగురు కుటుంబసభ్యులను చంపిన తర్వాత మరో ఇద్దరు చిన్నారులను సైతం హతమార్చేందుకు జాలీ కుట్రపన్నినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios