కొచ్చి: కేరళ రాష్ట్రంలో హోం క్వారంటైన్ పేరుతో ఓ వైద్యశాఖాధికారి అత్యాచారానికి పాల్పడినట్టుగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

మలప్పురంలో 44 ఏళ్ల మహిళ నర్సుగా పనిచేస్తుంది. జూనియర్ హెల్త్ ఇన్స్ పెక్టర్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బాధితురాలు తన బంధువుల ఇంట్లో క్వారంటైన్ లో ఉంది.  కోవిడ్ పరీక్షల పేరుతో ప్రతి రోజూ తనకు ఫోన్ చేసేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

హోం క్వారంటైన్ పూర్తైన తర్వాత కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొనేందుకు తన ఇంటికి రావాలని బాధితురాలిని ఆయన ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా బాధితురాలు ఆరోపణలు చేసింది.

జూనియర్ హెల్త్ ఇన్స్ పెక్టర్ ఇంటికి చేరగానే ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించింది.బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాధితురాలిపై ఈ నెల 3వ తేదీన చోటు చేసుకొంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.