బెంగళూరు: కర్ణాటక డ్రగ్ కేసులో సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు కోర్టులో చుక్కెదురైంది. వారిద్దరికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

మరో నలుగురి బెయిల్ పిటిషన్లను కూడా జస్టీస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ తిరస్కరించారు. సినీ నిర్మాత శివప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు. 

డ్రగ్ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర నేర విభాగం (సీసీబీ) సెప్టెంబర్ నెలలో రాగిణి ద్వివేదిని, సంజనా గల్రానీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శివప్రకాష్ ఇప్పటికి కూడా పోలీసులను తప్పించుకునే తిరుగుతున్నారు. 

రాగిణి, సంజనాలతో పాటు డ్రగ్ సప్లయర్ ప్రశాంత్ రాంకా సెప్టెంబర్ 13వ తేదీ వరకు సీసీబీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పంగించారు ప్రశాంత్ రాంకాకు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది.  

వారు బెంగళూరులోని పరప్పన అగ్రహారంలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. మలయాళం టెలివిజన్ సీరియల్ యాక్టర్ ్నిఖ, బినీష్ కోడియేరీ సహాయకుడు మొహమ్మద్ అనూప్ లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన తర్వాత బెంగళూరు పోలీసులు డ్రగ్ కేసులో వేగం పెంచారు.