ఇక నుంచి వారిని అలా పిలవకూడదట

karnataka minister jayamala comments on sex workers
Highlights

సెక్స్ వర్కర్లపై మంత్రి వ్యాఖ్యలు

సెక్స్ వర్కర్లను ఇప్పటి వరకు వేశ్యలు, వ్యభిచారిణిలుగా పిలిచేవారు. అయితే.. ఇక నుంచి సెక్స్‌ వర్కర్లను  ధమనిత మహిళలు అని  పిలవాలని కర్ణాటక రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి జయమాల సూచించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం తన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధిపనులు, అమలు తీరు, ప్రగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. 

మంత్రి మాట్లాడుతూ సెక్స్‌ వర్కర్లను ఆ పేరుతో పిలు వరాదని, వారిని ధమనిత మహిళ అని పిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వెనుకబడిన వర్గాల మహిళల సంక్షేమానికి అమలు చేసే పథకాలు లబ్ధిదా రుల దరిచేరేలా చూడాలన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ముందుండాలని అన్నారు. కన్నడ, సంస్కృతి శాఖలో కళాకారులకు పింఛన్ల పంపిణీ, ఇతర సదుపాయాల కల్పనపై కసరత్తు చేస్తామన్నారు.

కర్ణాటక మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి జయమాల అన్న విషయం అందరికీ తెలిసిందే.  

loader