బెంగుళూరు: కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారం చేసిన ఘటనలో  ఐదుగురు విద్యార్థులను బుధవారం నాడు  పోలీసులు అరెస్ట్ చేశారు.

కాలేజీ విద్యార్ధినిపై ఈ ఏడాది మార్చిలో  ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ అత్యాచార ఘటనకు సంబంధించిన విడియోలను ఈ వారంలో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.

రేప్ చేసిన నిందితులంతా 19 ఏళ్ల వాళ్లేనని పోలీసులు తెలిపారు. నిందితులకు బాధితురాలికి పరిచయం ఉంది. వీరంతా ఒకే కాలేజీ వాళ్లే.ఈ ఏడాది మార్చి మాసంలో  బాధితురాలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  అత్యాచారానికి పాల్పడే సమయంలో తమ సెల్‌పోన్లలో రికార్డు చేశారు.

ఈ విషయమై ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని  నిందితులు బెదిరించారు. కానీ నిందితులే  ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోలను షేర్ చేస్తే  వారిని కూడ శిక్షిస్తామని ఎస్పీ హెచ్చరించారు.