ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను మరో సమస్య చుట్టుముట్టింది. ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదిరిగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శినసేన ప్రభుత్వం ఆమెపై భగ్గుమంటోంది. ఈ స్థితిలో ఆమెపై డ్రస్ సంబంధాలకు సంబంధించిన కేసు నమోదైంది. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సంబంధాలపై కంగనా రనౌత్ మీద మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

మాజీ బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూను ఆధారం చేసుకుని కంగనాపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ధ్రువీకరించారు. కంగనా డ్రగ్స్ తీసుకుంటుందని, తనను కూడా అందుకు ప్రోత్సహించిందని అధ్యయన్ సుమన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

Also Read: 'మహా' జగడం: బాలీవుడ్ నటి కంగనాకు బిఎంసీ బిగ్ షాక్

సుశాంత్ రాజద్ పుత్ మృతి కేసులో ముంబై పోలీసులను తాను విశ్వసించలేనని కంగనా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్ ఆ ప్రకటన చేశారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. కంగనా వ్యాఖ్య ముంబై పోలీసులను అవమానిస్తోందని, కంగనా ముంబై రావద్దని ఆయన అన్నారు. 

దానికి ప్రతిగా కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబై పాకిస్తాన్ అక్రమిత కాశ్మీరులా కనిపిస్తోందని ఆమె అన్నారు. దానిపై శివసేన నాయకత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడ్డాయి. కంగనా ఈ నెల 9వ తేదీన ముంబై వస్తున్నట్లు తెలిపింది.

Also Read: కంగనా రనౌత్‌తో ఢీ అంటే ఢీ: సంజయ్ రౌత్‌కు కొత్త పదవి కట్టబెట్టిన శివసేన