బిజెపికి షాక్: జయనగర‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్యరెడ్డి విజయం

Jayanagar election results: Congress candidate leading by 10,000
Highlights

సిట్టింగ్ స్థానంలో బిజెపికి ఎదురుదెబ్బ


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని జయనగర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సౌమ్యరెడ్డి  తన సమీప బిజెపి అభ్యర్ధిపై 2889 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జయనగర  బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆకస్మికంగా మరణించడంతో ఈ స్థానానికి ఈ ఏడాది మే 12 వ తేదిన జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

దీంతో ఈ స్థానానికి ఎన్నికలను జూన్ 11న నిర్వహించారు. 55 శాతంం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో బిజెపి తరపున విజయ్ కుమార్ సోదరుడు ప్రహ్లాద , కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ రాష్ట్ర హోంశాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యరెడ్డి పోటీ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ కూటమి అధికారంలో ఉంది. దీంతో ఈ స్థానంలో బరిలో ఉన్న జెడిఎస్ అభ్యర్ధిని పోటీ నుండి ఆ పార్టీ ఉప సంహరించుకొంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ తన మద్దతును ప్రకటించింది.

ఈ స్థానంలో 18 మంది బరిలో నిలిచారు. అయితే వీరిలో కాంగ్రెస్, బిజెపి మధ్యే ప్రధానంగా పోటీ సాగింది.   కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్యరెడ్డి బిజెపి అభ్యర్ధి ప్రహ్లాదపై  2889 ఓట్ల తో విజయం సాధించారు..

కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు లభించాయి. బిజెపికి 33.2 ఓట్లు లభించాయి.  16వ రౌండ్‌లో బిజెపి ఆదిక్యాన్ని సాధించింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారీగా తగ్గించింది. సౌమ్యరెడ్డి 2889 ఓట్లతో విజయాన్ని సాధించింది.  దీంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం 80కు చేరుకొంది. అయితే గత మాసంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ 79 స్థానాలున్నాయి. 

ఈ స్థానంలో బిజెపి నేతల మధ్య ఉన్న అనైక్యత కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కల్గించిందని పార్టీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీని సాధిస్తోందని భావించిన చివరి రౌండ్లలో ఆ పార్టీ పుంజకోవడంతో భారీ ఆధిక్యం దక్కలేదు. కేవలం 2889 ఓట్ల మెజారిటీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకొంది.

loader