యూపీలో జపనీస్ ఎన్సెఫలైటిస్ తగ్గుముఖం: సీఎం యోగి చొరవతో వ్యాక్సినేషన్ సక్సెస్

సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాల కారణంగా జపనీస్ ఎన్సెఫలైటిస్ (జెఇ) మరణాలలో గణనీయమైన తగ్గుదల వచ్చింది.

Japanese Encephalitis Declining in Purvanchal: CM Yogi's Healthcare Initiatives Drive Vaccination Success AKP

లక్నో. ఒకప్పుడు పూర్వాంచల్‌లో పిల్లలను బలితీసుకున్న జపనీస్ ఎన్సెఫలైటిస్ (జెఇ) నేడు పూర్తిగా నిర్మూలన అంచున ఉంది. 2017లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం యోగి అమలు చేసిన వ్యూహాలే ఈ వ్యాధిని తుడిచిపెట్టిందని అనడంలో అతిశయోక్తి లేదు. జెఇ ముప్పు నుండి పూర్వాంచల్‌ను రక్షించడానికి సీఎం యోగి పూర్తి స్థాయి వ్యూహంపై పనిచేశారు.

సీఎం యోగి మార్గదర్శకత్వంలో జెఇకి వ్యతిరేకంగా పూర్తి వ్యూహాన్ని రూపొందించడమే కాదు... అన్ని విభాగాల సమన్వయంతో అమలు చేశారు. ఆరోగ్య శాఖలోని ప్రతి విషయాన్ని సీఎం యోగి పర్యవేక్షించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్య శాఖను ఆదేశించారు. అంతేకాదు విస్తృత ప్రచారం ద్వారా ప్రజలకు జెఇ టీకాలపై అవగాహన కల్పించారు.

యోగి సర్కార్ గత మూడు సంవత్సరాలలో పూర్వాంచల్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు 2 కోట్ల జెఇ-1, జెఇ-2 టీకాలు వేశారు. దీని ఫలితంగా నేడు పూర్వాంచల్ జెఇ నుండి విముక్తి పొందింది. గతంలో ఈ వ్యాధి కారణంగా అనేక కుటుంబాల్లో విషాదం నిండివుండేది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు, కానీ నేడు ప్రజలకు ఈ వ్యాధి భయం లేదు, దాని చికిత్సకు అయ్యే ఖర్చు కూడా లేదు.

జెఇ టీకాలపై అవగాహన కల్పించేందుకు 1.70 లక్షల మంది ఆశా కార్యకర్తలకు శిక్షణ

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వెంటనే, అంటువ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ (జెఇ) నిర్మూలనకు వంద శాతం టీకాలు వేయాలని ఆదేశించారని యూపీ వైద్య ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ పింకీ జోవెల్ తెలిపారు. అలాగే ప్రజలకు జెఇ టీకాలపై అవగాహన కల్పించడానికి ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఇంటింటికీ (డోర్ టు డోర్) ప్రచారం చేయాలని ఆదేశించారు. సీఎం యోగి ఆదేశాల మేరకు 1.70 లక్షల మందికి పైగా ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని కార్యదర్శి తెలిపారు.

ఇక ఏడాదిలో మూడుసార్లు ఇంటింటికీ వెళ్లి జెఇ వ్యాప్తికి కారణాలు, నివారణ చర్యలు, చికిత్స యొక్క ప్రాముఖ్యత,  టీకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. తద్వారా వారు టీకాలు వేయించుకోవడానికి ముందుకు వస్తారని తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా ఆశా కార్యకర్తలు దాదాపు 4 కోట్ల ఇళ్లను సందర్శించి వ్యక్తిగతంగా సంప్రదించారని పింకీ జోవెల్ తెలిపారు.

 సీఎం యోగి కృషి ఫలితంగా జెఇ టీకాలకు దూరంగా ఉన్న వారు ముందుకు వచ్చారన్నారు. 2023-24లో యోగి ప్రభుత్వం 34,64,174  జెఇ-1 టీకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 33,85,506 టీకాలు వేశారన్నారు. అదేవిధంగా, 2022-21లో జెఇ-1 కోసం 34,59,417 టీకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 33,78,189 టీకాలు వేశారు, అయితే 2021-22లో 34,43,938 టీకాల లక్ష్యానికి 28,40,827 టీకాలు వేశారు. కరోనా మహమ్మారి కారణంగా టీకాలు వేయడం కొంత తగ్గిందన్నారు.

సీఎం యోగి కృషితో జెఇ మరణాల రేటు 99 శాతం తగ్గింది

2023-24లో యోగి ప్రభుత్వం జెఇ-2 కోసం 32,63,507 టీకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 31,02,741 టీకాలు వేశారని జాతీయ ఆరోగ్య మిషన్ జనరల్ మేనేజర్ డాక్టర్ మనోజ్ శుక్లా తెలిపారు. అదేవిధంగా, 2022-21లో జెఇ-2 కోసం 32,59,026 టీకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 30,67,275 టీకాలు వేశారు, అయితే 2021-22లో 32,45,949 టీకాల లక్ష్యానికి 23,82,369 టీకాలు వేసినట్లు తెలిపారు.

సీఎం యోగి కృషి ఫలితంగా 2023లో మెదడు జ్వరం కారణంగా మరణాల రేటు కేవలం 1.23 శాతంగా నమోదైందన్నారు. 2017లో మరణాల రేటు 13.87 శాతంగా ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి తగ్గిందన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోగి ప్రభుత్వం మెదడు జ్వరం కారణంగా మరణాల రేటును 99 శాతం తగ్గించి రికార్డు సృష్టించింది. 

టీకాల వల్ల జెఇ మరణాలకు అడ్డుకట్ట

జపనీస్ ఎన్సెఫలైటిస్ నుండి రక్షణ కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. గత ఆరేడు సంవత్సరాలుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రిచపై ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహించారు. దీని ప్రభావంతో జపనీస్ ఎన్సెఫలైటిస్ కేసులు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి కారణంగా మరణాలు సున్నాకి చేరుకున్నాయి. గత ఏడాది దీని వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి అదుపులోనే ఉంది.

-డాక్టర్ ఆశుతోష్ కుమార్ దూబే, ప్రధాన వైద్య అధికారి, గోరఖ్‌పూర్

టీకా మిస్ అయితే పదిహేను సంవత్సరాల వరకు వేయించుకోవచ్చు

పన్నెండు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కోసం పిల్లలకు ఐదు సంవత్సరాలలో ఏడుసార్లు వేసే టీకాల్లో ఈ టీకా కూడా ఒకటి. జపనీస్ ఎన్సెఫలైటిస్ నుండి రక్షణ కోసం పిల్లలకు రెండు సార్లు టీకా వేస్తారు. మొదటి సారి టీకా తొమ్మిది నుండి పన్నెండు నెలల వయస్సులో వేస్తారు. ఈ టీకాను ఎంఆర్ వ్యాక్సిన్‌తో పాటు వేస్తారు. రెండవ సారి టీకా పదహారు నుండి ఇరవై నాలుగు నెలల వయస్సులో వేస్తారు. దీనిని డిపిటి బూస్టర్ డోస్‌తో పాటు వేస్తారు. ఎవరైనా శిశువు ఈ టీకాను మిస్ అయితే, వారికి పదిహేను సంవత్సరాల వయస్సులోపు ఎప్పుడైనా ఈ టీకా వేయించుకోవచ్చు.

-డాక్టర్ నందలాల్ కుశ్వాహా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి

జెఇ నిర్మూలనతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి 

గతంలో ఎన్సెఫలైటిస్ పూర్వాంచల్‌కు గుదిబండగా మారింది. సీఎం యోగి కృషితో నేడు అది దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. ఒకప్పుడు జూలై నుండి సెప్టెంబర్ వరకు అమాయక చిన్నారుల మరణాలు అత్యధికంగా వుండేవి. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. యోగి ప్రభుత్వం దస్తక్ ప్రచారం నిర్వహించి ఇంటింటికీ అవగాహన కల్పించడం, టీకాలు వేయడం, జ్వరం ట్రాకింగ్‌ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. నేడు దాని ఫలితాలు మనందరికీ కనిపిస్తున్నాయి.

సీఎం యోగి సూక్ష్మ స్థాయి పరిశీలన, జోక్యం తర్వాత అన్ని శాఖలు జెఇ నిర్మూలన కోసం కలిసి పనిచేశాయి. అందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు పకడ్బందీగా వ్యవహరించాయి. వాటి మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేశారు.

గ్రామ స్థాయి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎంలకు శిక్షణ ఇచ్చి, ఈ వ్యాధి ముందుకు సాగకుండా అడ్డుకునేలా సమర్థవంతంగా తీర్చిదిద్దారు. గతంలో ప్రజలు ఈ వ్యాధి గురించి భయపడి, దాని చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చు చేసేవారు, అయితే నేడు వారు నిశ్చింతగా ఉన్నారు. ఆ డబ్బును వారు నేడు వ్యాపారం,  పిల్లల మంచి పెంపకం కోసం ఖర్చు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios