నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 60ఏళ్లు దాటిన ముసలావిడ వరకు ఎవరినీ వదలిపెట్టని కామాంధులను మనం రోజూ టీవీల్లో, పేపర్లో వార్తల్లో చూస్తున్నాం. అయితే.. కేవలం స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఓ వ్యక్తి అభం శుభం తెలియిని 35మంది చిన్నారులతోపాటు... 40 పురుషులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జైపూర్ లోని శాస్త్రీ నగర్ కి చెందిన ఏడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో... నిందితుడి అసలు చరిత్ర తెలుసుకొని పోలీసులు కూడా షాకయ్యారు.

గతంలో ఈ కామాంధుడు 35 మంది చిన్నారులు, 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలను అపహరించి అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో జల్సాలు చేసే వాడని పోలీసులు చెప్పారు. మద్యం, సెక్స్‌కు బానిసైన ఈ వ్యక్తి పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అనే తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.  గతంలో కూడా ఇతని పై పలు కేసులు నమోదయ్యాయన్నారు.  నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.