సెక్స్ చేస్తూ.. ఊపిరాడక మృతి

Israeli woman dies of suffocation during sex in Mumbai hotel, boyfriend booked
Highlights

ఇరుక్కున్న బాయ్ ఫ్రెండ్

ప్రియుడితో సెక్స్ చేస్తూ.. ఓ యువతి ఊపిరాడక  చనిపోయింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గతేడాది మార్చిలో ముంబైలోని కోలాబా ఏరియాకు వచ్చారు. టూరిస్ట్ వీసా మీద ముంబైకి వచ్చిన వారిద్దరూ.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు.

23 ఏళ్ల ప్రియుడు, 20 ఏళ్ల ప్రియురాలు ఇద్దరు కలిసి హోటల్ గదిలో శృంగారంలో పాల్గొన్నారు. అయితే శృంగారం చేస్తున్న సమయంలో ప్రియుడు.. ప్రియురాలి మెడపై గట్టిగా నొక్కడంతో ఆమె ఊపిరాడక మృతి చెందింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన లవర్‌ను చూసి.. హోటల్ సిబ్బందికి ప్రియుడు యాకోవ్ సమాచారం అందించాడు. పోలీసులు, సిబ్బంది కలిసి.. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆ తర్వాత ప్రియురాలి మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు తరలించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవలే ఓ నివేదిక విడుదల చేశారు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె మెడపై గట్టిగా నొక్కడంతోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడించారు. దీంతో ప్రియుడు యాకోవ్‌పై పోలీసులు అభియోగం నమోదు చేశారు. ప్రస్తుతం యాకోవ్ ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

loader