రెమిడెసివర్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..
రోజురోజుకూ కరోనా విజృంభణ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కోవిడ్ చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
రోజురోజుకూ కరోనా విజృంభణ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కోవిడ్ చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇతర దేశాల నుంచి రెమిడెసివిర్ ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 4,50,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్ ను శుక్రవారం అందుకుంది. దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో రెమిడెసివిర్ దిగుమతులపై దృష్టి పెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధం ఎగుమతిని కేంద్రం నిషేధించింది.
కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, యు ఈజిప్టు ఫార్మా మేజర్ ఇవా ఫార్మా సంస్థలనుంచి వీటిని కొనుగోలు చేయనుంది. రాబోయే ఒకట్రెండ్ రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్ కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ తాజాగా ప్రకటించింది.
అలాగే ఎవా ఫార్మా తొలుత పదివేల వయల్స్ దేశానికి అందించనుంది. ఆ తరువాత జూలై వరకు ప్రతీ 15 రోజులకొకసారి 50వేల వయల్స్ వరకు మన దేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది.
దీంతోపాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ ఔషద ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03కోట్ల వయల్స్ కు పెంచాయి.
రేపటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి టీకా: చేతులెత్తేసిన జగన్, ఈటెల...
కాగా గత ఏడు రోజల్లో దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వయిల్స్ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివర్ సరఫరా ఏప్రిల్ 11న 67, 900 నుంచి ఏప్రిల్ 28న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,86,452 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, 3,498 మరణాలు సంభవించాయి. 2,97,540 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona