భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి రెమిడెసివర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

భవిష్యత్‌లో రెమిడెసివర్‌కు డిమాండ్ పెరిగే అవకాశం వుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం  తీసుకుంది. అలాగే రెమిడెసివర్ ఉత్పత్తితో పాటు దానిని పంపిణీదారులు నిల్వ చేయొద్దని కేంద్రం ఆదేశించింది.

రెమిడెసివర్ ఔషధ నిల్వలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే రెమిడెసివర్ నిల్వలు నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.