దారుణం:కొన్ని గంటల్లో పెళ్ళికి లవర్స్ ప్లాన్, షాకిచ్చిన తండ్రి

In UP's Ambedkar Nagar, irate father shoots dead daughter, lover in honour killing case
Highlights

కూతురిని ప్రియుడిని కాాల్చి చంపిన తండ్రి


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడిని ప్రేమించిన పాపానికి కూతురితో సహ ఆమె ప్రియుడిని హత్య చేశాడు తండ్రి. ఇంటి నుండి పారిపోయి పెళ్ళి చేసుకొందామనుకొన్న ఆ జంటను మృతువు కబళించింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ జంగ్లా అంబేద్కర్ నగర్ కు చెందిన జైష్‌రాజ్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులతో పాటు వందన అనే కుమార్తె ఉంది. సవారా గ్రామానికి చెందిన  యువకుడు శశికాంత్ ను ఆ యువతి  ప్రేమించింది. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి ఆమెపై సీరియస్ అయ్యాడు.  ఆ యువకుడినే తాను వివాహం చేసుకొంటానని ఆ యువతి తండ్రితో చెప్పింది.  కానీ, వారు మాత్రం ఈ పెళ్ళికి అంగీకరించలేదు.


అయితే ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకోవాలని ఆమె తన ప్రియుడికి తన పథకాన్ని వివరించింది.  ఈ పథకం ప్రకారంగా  ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ ఇంటికి రావాలని శశికాంత్‌కు వందన సమాచారాన్ని పంపింది.

వందన పంపిన సమాచారం మేరకు  శశికాంత్ అమె ఇంటికి చేరుకొన్నాడు. వారిద్దరూ మాట్లాడుకొంటున్న సమయంలోనే తండ్రి ఇంటికి చేరుకొన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురితో మాట్లాడుతున్న శశికాంత్‌ను చూసిన  జైష్‌రాజ్  కోపంతో ఊగిపోయాడు. 

ఇంట్లో ఉన్న తన తుపాకీని తీసుకొని కూతురు వందనను ఆమె ప్రియుడు శశికాంత్ ను కాల్చి చంపాడు.శశికాంత్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader