దారుణం: 32 మంది అనాథ బాలికలపై ఆశ్రమంలోనే రేప్, మత్తిచ్చి ఇలా...

In Muzaffarpur, girls recall horror: Cut ourselves to avoid 'ganda kaam', 'found my pants thrown on floor'
Highlights

 అనాథ బాలికలకు  ఆశ్రయం కల్పిస్తున్నామనే  కారణంగా స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు మైనర్ బాలికలకు నరకం చూపారు. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న బాలికలకు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడేవారు. 

ముజఫర్‌పూర్: అనాథ బాలికలకు  ఆశ్రయం కల్పిస్తున్నామనే  కారణంగా స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు మైనర్ బాలికలకు నరకం చూపారు. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న బాలికలకు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడేవారు. ఆశ్రమంలో ఉన్న 42 మంది బాలికల్లో  34 మంది బాలికలు అత్యాచారానికి గురయ్యారని వైద్య పరీక్షల ద్వారా తేలింది. అత్యాచారానికి గురైనవారిలో  మానసిక వికలాంగులే ఎక్కువ. అంతేకాదు వీరి వయస్సు  18 ఏళ్లలోపు.

బీహార్ రాష్ట్రంలోని  ముజఫర్‌పూర్‌లో ని ఓ అనాథ బాలికల వసతి గృహంలో మానసిక వికలాంగులైన బాలికలకు ఆశ్రయం కల్పించే పేరుతో ఆశ్రమ నిర్వాహకులు ఆ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారని తేలింది. 

మత్తు మందులు ఇవ్వడం, కొట్టడం, అత్యాచారం చేయడం, భయపెట్టడం లాంటి ఘటనలతో  ఆ బాలికలు ప్రతిరోజూ అక్కడ నరకాన్ని అనుభవించేవారు.  మత్తు మందులు ఇచ్చి ఆ  బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారు. మత్తు మందులతో  బాధితులు స్పృహ కోల్పోయినా కానీ  ఆ మానవ మృగాలు  కనికరం చూపేవారు కాదు. 

ఈ బాలికలకు పొట్టి దుస్తులను వేయించి  ఇతరుల ముందు నాట్యం చేయించేవారు.  ముజఫర్‌పూర్  జిల్లా శిశు సంరక్షణాధికారి రవికుమార్ రోషన్  అని బాధిత బాలికలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్వచ్చంధ సంస్థను బ్రజేష్ ఠాకూర్ నిర్వహించేవాడు.  రవికుమార్ కు బ్రజేష్ ఠాకూర్ సహకరించేవాడు. 

ఈ ఆశ్రమంలో  ఆశ్రయం పొందే బాలికలది ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఈ ఆశ్రమానికి వచ్చే వారికి ఆశ్రమంలో ఉన్న బాలికలను పంపేవారు. బాలికలకు మత్తు  ఇచ్చే విషయం కూడ బాధితులకు తెలియదు. రోషన్ అనే వ్యక్తి తమ ఆశ్రమానికి తరచూ వచ్చేవాడని అతని వద్దకు తనను చందా ఆంటీ పంపేదని ఓ బాధితురాలు పోలీసులకు చెప్పింది.

చందా ఆంటీ ఇచ్చే మాత్ర వేసుకొన్న తర్వాత తాను స్పృహ కోల్పోయేదాన్నని చెప్పింది.  అయితే తాను నిద్ర లేచేసరికి తన ఒంటిపై బట్టలు ఉండేవి కావన్నారు. రోషన్ తనపై అత్యాచారానికి పాల్పడేవాడని ఆమె చెప్పింది. తన భర్తపై వచ్చిన ఆరోపణలను  రోషన్ భార్య ఖండించింది. ఓ మంత్రిని కాపాడేందుకు తన భర్తను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపణలు గుప్పించారు. 

ఈ వసతి గృహంలో  అనాథ బాలికలపై జరిగిన  అత్యాచారానికి  సంబంధించి వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది.ఈ మేరకు ప్రత్యేక బందాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో  ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

loader