Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ అంశంలో రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నపోలీసులు

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ, తన పదవికి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ias officer who resigned over kashmir issue detained
Author
Mumbai, First Published Dec 15, 2019, 4:45 PM IST

ముంబై: కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ, తన పదవికి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఇంకో పది మందితో కలిసి నిరసన తెలుపుతున్న గోపీనాథన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతంలోని అంబాసిడర్ హోటల్ బయట ఈ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనతెలుపుతుండగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 

పోలీసులు విడుదల చేసిన తరువాత ఒక ట్వీట్లో తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని, రాజ్యాంగాన్ని కూడా చదవనివ్వలేదని గోపీనాథన్ అన్నారు. 

మరొక ట్వీట్లో బయటకొచ్చి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ఈ నిరసన కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తాము చాల తక్కువమందిమి ఉన్నామని...కానీ ఎప్పుడైతే పోలీసు వారు అరెస్ట్ చేసారో చాలామంది ప్రజలు తరలివచ్చారని అప్పుడు పోలీసువారు విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios