న్యూఢిల్లీ: జోర్ హట్ నుండి బయలుదేరిన  ఐఎ ఎఫ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు లేకుండాపోయింది.

టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో 8 మంది  సిబ్బంది ఉన్నారు. ఎఏన్-32 విమానంలో 8 మంది సిబ్బందితో పాటు 13 మంది ప్రయాణీకులు ఉన్నారు. చివరిసారిగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఏటీసీతో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు టేకాఫ్ అయింది. 

ఐఎఎఫ్  ఎఎన్ -32  విమానం 2016లో అదృశ్యమైంది. ఆ సమయంలో విమానంలో 29 మంది  చెన్నై నుండి బయలుదేరిన విమానం అదృశ్యమైంది.జూలైలో ఈ విమానం అదృశ్యమైనా కూడ దాని ఆచూకీ కోసం అదే ఏడాది సెప్టెంబర్ వరకు వెతికారు. అయినా కూడ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సెప్టెంబర్ మాసంలో వెతకడం నిలిపివేశారు.