అహ్మదాబాద్‌​ : ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఓ వివాహితపై భర్త తరుపు బంధువులు సామూహిక అత్యాచారం చేశారు. దాంతో ఆగకుండా సెల్‌ఫోన్‌లో చిత్రికరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దానివల్ల ఈ దారుణమైన సంఘటన బయటి ప్రపంచానికి తెలిసింది. 

గుజరాత్‌, అహ్మదాబాద్‌ సమీపంలోని నానీ కరాజ్‌ గ్రామానికి చెందిన చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడిని ప్రేమించింది. దాంతో భర్త, పిల్లలను వదిలి అతనితో ఊరు వదిలి పారిపోవడానికి ప్రయత్నించింది.

ఆ విషయం భర్త తరఫు బంధువులకు తెలిసింది. దాంతో వారు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. మహిళ జుట్టును కత్తిరించారు.  ఆ తర్వాత ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అది వైరల్ అయి వ్యవహారం పోలీసులకు చేరింది. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్‌, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.