టిక్ టాక్ మోజులో పడి పట్టించుకోవడం లేదని ఓ భర్త.. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కడాంబులియూర్ కు చెందిన కుమరవేల్(26), నైవేలి దిడీర్ కుప్పానికి చెందిన రాజేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. నాలుగు నెలలుగా బన్రూట్టి అన్వర్ షాగర్ నాలుగో వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. కాగా... రాజేశ్వరికి ఇటీవల టిక్ టాక్ లో వీడియోలు చేయడం.. వాటిని చూస్తూ గడపడం బాగా అలవాటైంది.

Also Read కర్ణాటకలో వెరైటీ పెళ్లి పత్రిక: హల్ టిక్కెట్టు నమూనాలో వెడ్డింగ్ కార్డు.

టిక్ టాక్ మోజులో పడి.. కనీసం భర్త, పిల్లలను కూడా సరిగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అతనితో కలిసి టిక్ టాక్ వీడియోలు తీయడం మొదలుపెట్టింది. దీంతో... అవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు.

ఆమెను మందలించినా పట్టించుకోలేదని..ఆగ్రహంతో ఇనుపరాడ్‌తో హత్య చేశాడు. తొలుత తనకేమీ తెలీదని పోలీసుల ముందు బకాయించాడు. అయితే... హత్య చేసింది అతనే అంటూ రాజేశ్వరి తల్లి పోలీసులకు గట్టిగా చెప్పడంతో... కుమరవేల్ ని పోలీసులు నిలదీశారు. దీంతో.. తానే హత్య చేశానని నిజం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.