Asianet News TeluguAsianet News Telugu

How To cast vote: ఓటు ఎలా వేయాలో తెలుసా? ఈ రూల్స్ ను మర్చిపోవద్దు!

How To cast vote: తొలి ఓటు వేసేవారికి ఎన్నో  సందేహాలు ఉంటాయి. ఓటు ఎలా వేయాలి. అసలు ఓటర్ల జాబితాలో తన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? పోలింగ్ స్టేషన్‌ లేదా పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.  పోలింగ్ స్టేషన్ కు వెళ్లే ముందు... పోలింగ్ బూత్ లో ఎలాంటి నియమాలు పాటించాలి. ఇంతకీ EVM అంటే ఏమిటి? వీవీప్యాట్ అంటే ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం. 

How to cast your vote using EVM and VVPAT KRJ
Author
First Published Mar 16, 2024, 1:02 PM IST

How To cast vote: తొలి ఓటు వేసేవారికి ఎన్నో  సందేహాలు ఉంటాయి. ఓటు ఎలా వేయాలి. అసలు ఓటర్ల జాబితాలో తన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? పోలింగ్ స్టేషన్‌ లేదా పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.  పోలింగ్ స్టేషన్ కు వెళ్లే ముందు... పోలింగ్ బూత్ లో ఎలాంటి నియమాలు పాటించాలి. ఇంతకీ EVM అంటే ఏమిటి? వీవీప్యాట్ అంటే ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం. 

ఓటింగ్ ప్రక్రియ.

పోలింగ్ స్టేషన్ కు వెళ్లే ముందు...

ఓటర్లు తమ ఓటు హక్కు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో ముందుగా తెలుసుకోవాలి.  ఇందుకోసం..  electoralsearch.in లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సెట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి కూడా ఓటరు తన సమాచారాన్ని అడగవచ్చు.  అలాగే.. పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఓటరు తన ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్లును తీసుకెళ్లాలి. ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఓటెయ్యొచ్చు.. దాదాపు ఇతర  12 కార్డుల్లో ఏది ఉన్నా ఓకే..!. ఓటర్ స్లిప్ అనేది.. ఎన్నికల అధికారుల మీ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళతారు. ఒక వేళ ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ బూత్‌ వద్ద లేదా రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద కూడా పొందవచ్చు.

పోలింగ్ బూత్ లో లేదా పోలింగ్ స్టేషన్‌లో.. 

>> మెుదటి అధికారి ఓటరు జాబితాలో మీ గుర్తింపు కార్డులోని పేరుతో పరిశీలిస్తారు. ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి, మీ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు.

>> రెండో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. అలాగే.. రిజిస్టర్‌పై మీతో సంతకం చేయిస్తారు. (ఫారం 17A)

>> మూడో అధికారి ఆ చీటిని చెక్ చేసి.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) దగ్గరకు పంపిస్తారు.  మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి.

>> ప్రిసైడిండ్ అధికారి/ పోలింగ్ అధికారి ఈవీఎం మిషన్ బటన్ నొక్కిన తరువాత ఈవీఎం యంత్రంపై మిమ్ములను ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

>> మీరు ఈవీఎం యంత్రంపై ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు సరిగా గుర్తించి..  మీరు నచ్చిన  అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌పై నొక్కాలి.

>> అప్పుడు దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడంతో పాటు పెద్దగా బీప్ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క. 

>> మీ ఓటు ఎవరికి పడిందో లేదో.. తెలుసుకోవడానికి ఈవీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లో చూడవచ్చు.

>> సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఎవరికి ఓటు వేశామో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.

>>ఒకవేళ.. వీవీప్యాట్ లో బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా.. బీప్ సౌండ్ రాకపోయినా.. మీరు వెంటనే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి.

ఈవీఎం (EVM) అంటే ఏమిటి?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM) అనేది ఎలక్ట్రానిక్ ఓటు రికార్డింగ్ పరికరం. ఈ ఈవీఎంలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, మరోటి బ్యాలెట్ యూనిట్. ఇవి ఒకదాన్ని ఒకటి  కనెక్ట్ చేయబడి ఉంటాయి. వీటి కంట్రోల్ యూనిట్ అనే పరికరం..  ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి చేతిలో ఉంటుంది. ఆయనే దీన్ని ఆపరేట్ చేస్తారు.  మరోకటి  బ్యాలెట్ యూనిట్.. ఇది బూత్ లోపల ఉంటుంది. గతంలో ఇవ్వబడిన బ్యాలెట్ పేపర్ కు బదులుగా దీనిని ఉపయోగిస్తున్నారు. కంట్రోల్ యూనిట్ వద్ద  బ్యాలెట్ బటన్‌ను నొక్కడం ద్వారా ఓటరు తాను వేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓటరు తన ఓటు ఎవరికి వేశాడన్నది.. ప్రిసైడింగ్ అధికారులకు కూడా తెలిసే అవకాశం ఉండదు.

వీవీ ప్యాట్ (VVPAT) అంటే ఏమిటి?

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లకు అనుసంధానించిన యంత్రం. ఇది బ్యాలెట్ యూనిట్‌లో ఎవరికి ఓటు వేశారనేది.సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఎవరికి ఓటు వేశామో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. ఒకవేళ.. వీవీప్యాట్ లో బ్యాలెట్ స్లిప్ కనిపించకపోతే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి. వారు సమస్యను గుర్తించి సరి చేస్తారు.

గమనిక: పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు లేదా మరే ఇతర గాడ్జెట్ అనుమతించబడదు. ఒక వేళ దొంగ చాటును మీరు వేస్తు ఫోటోలు తీసుకోవడం కూడా నేరం. 

మీకు మరింత సమాచారం కావాలంటే అధికారిక వెబ్ సైట్ http://ecisveep.nic.in/లో ఓటర్ గైడ్‌ చెక్ చేసుకోవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios