Asianet News TeluguAsianet News Telugu

నా కూతురికి న్యాయం జరగకుంటే... నిర్భయ తల్లి షాకింగ్ కామెంట్స్

దోషులను ఉరితీసినా తన పోరాటం కొనసాగుతుందని, ఇది తన ఒక్కరి పోరాటం కాదని, ఈ దేశం బిడ్డల కోసం తన పోరాటం సాగుతుందని ఆశాదేవి స్పష్టం చేశారు. దోషులను వదిలివేయాలని తనను అడుగుతున్న వారు తమ బిడ్డలకు ఇదే జరిగితే వారు దోషులను వదిలివేస్తారా అని ఆమె ప్రశ్నించారు. 
 

Hope The Rapists Are Ececuted on March3: Nirbhaya's Mother on fresh Hanging date
Author
Hyderabad, First Published Feb 20, 2020, 9:13 AM IST

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష ప్రతిసారీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఉరి శిక్ష తేదీలు ఖరారైనా పలు కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా...మార్చి 3న ఉరి తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పటియాలా కోర్టు డెత్ వారెంట్ కూడా జారీ చేసింది. కాగా... పలు మార్లు ఉరి తేదీ లు వాయిదా పడటంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు.

నిర్భయకు న్యాయం జరగకుంటే... ఇలాంటి తీవ్ర నేరాలకు గురైన ఇతర బాధితులెవరికీ న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు.  నిర్భయ కోసం న్యాయం జరగాలని కోరుతూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె కోరారు.

ఇదే విషయంపై ఆమె తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తమ కుమార్తెకు త్వరగా న్యాయం చేకూరేలా చూడాలని ఆమె వేడుకున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని, ప్రాధేయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పరిస్థితులు మారినా తాను ఇంకా కోర్టు ముందు చేతులు జోడించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read నిర్భయ కేసు: తలను గోడకేసి కొట్టుకున్న దోషి వినయ్ శర్మ...

దోషులను ఉరితీసినా తన పోరాటం కొనసాగుతుందని, ఇది తన ఒక్కరి పోరాటం కాదని, ఈ దేశం బిడ్డల కోసం తన పోరాటం సాగుతుందని ఆశాదేవి స్పష్టం చేశారు. దోషులను వదిలివేయాలని తనను అడుగుతున్న వారు తమ బిడ్డలకు ఇదే జరిగితే వారు దోషులను వదిలివేస్తారా అని ఆమె ప్రశ్నించారు. 

కోర్టులపై విశ్వాసం సన్నగిల్లినందునే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం హైదరాబాద్‌లో ప్రజలు స్వీట్లు పంచుకున్నారని గుర్తుచేశారు. మహిళలపై నేరాలను తగ్గించేందుకు నిర్భయకు న్యాయం చేయాలని తాను సుప్రీంకోర్టును కోరతానని అన్నారు. 

మానవహక్కుల కార్యకర్తలు వారి మనుగడ కోసం చెప్పే మాటలు తాను వినదల్చుకోలేదని, దోషులను ఉరితీయాల్సిందేనని తేల్చిచెప్పారు. కోర్టు తన ఎదుటే దోషుల హక్కుల గురించి మాట్లాడుతూ తన బాధను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios