పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేశారు. వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా మహేంద్రటోలా గ్రామంలో థీరెన్ మండల్, సుమతి మండల్‌ల 16 ఏళ్ల కుమార్తె,  9వ తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో సదరు యువతి తన పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్న వారు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి పక్కనేవున్న గంగానదిలో పడేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు నదిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.