రెండు రోజుల బెంగాల్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. మమతా బెనర్జీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బూర్‌భూమిలో రోడ్ షో నిర్వహించిన అమిత్ షా.. బంగారు బెంగాల్ కావాలంటే బీజేపీకి ఓటేయ్యాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

రోడ్ షో అనంతరం అమిత్ షా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కేంద్రం నిధులు బెంగాల్లో ప్రజలకు చేరడం లేదని అమిత్ షా ఎద్దేవా చేశారు.

మా పార్టీ కార్యకర్తలైనా సరే చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను మమత భయపెట్టాలని చూస్తున్నారని షా ఆరోపించారు. కేంద్రం పంపిన తుఫాన్ సాయాన్ని మమత దుర్వినియోగం చేశారన్నారు.

బెంగాల్‌లో 300 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని.. రాజకీయ హింస తారాస్థాయికి చేరిందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తల హత్యలపై విచారణలో ఎలాంటి పురోగతీ లేదని అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ మార్పును కోరుకుంటోందని అమిత్ షా స్పష్టం చేశారు.