స్టాలిన్ అరెస్ట్..

స్టాలిన్ అరెస్ట్..

తూత్తుకూడిలోని స్టెరిలైట్‌ ఘటనకు నిరసనగా తమిళనాడు సెక్రటేరియట్‌ ముందు ఆందోళన చేస్తున్న డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది డీఎంకే, ఇతర పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఎక్కించిన పోలీస్‌ వాహనాన్ని కదలనీయకుండా డీఎంకే మద్దతుదారులు అడ్డుగా నిలబడ్డారు. దీంతో డీఎంకే మద్దతుదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళన సమయంలో స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఇంతవరకూ నిందితులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి, డీజీపీ రాజేంద్రన్‌ వెంటనే రాజీనామా చెయ్యాలి’ అని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలంటూ  చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆందోళనలో  13మంది ప్రాణాలు కోల్పోయారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page