120 మందిని రేప్ చేసి వీడియోలు తీసిన బాబా

Haryana tantrik held for raping 120 women
Highlights

హర్యానా రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన అరవై ఏళ్ల మాంత్రికుడు 120 మంది మహిళలపై అత్యాచారం చేసిన విషయం బయటకు వచ్చింది. 

హిస్సార్:  హర్యానా రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన అరవై ఏళ్ల మాంత్రికుడు 120 మంది మహిళలపై అత్యాచారం చేసిన విషయం బయటకు వచ్చింది. అత్యాచార ఘటనలను వీడియోలు తీశాడు కూడా.  అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అలియాస్ బిల్లు 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా అత్యాచారం చేసిన దృశ్యాలను బాబా తన మొబైల్ ఫోన్ తో వీడియో తీసి భద్రపరుచుకున్నాడు. ఆ వీడియో క్లిప్ లు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ  వారిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

అత్యాచారానికి గురైన 120 మంది మహిళల వీడియో క్లిప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వీడియోలను బాబా అమరపురి సమీప బంధువే  పోలీసులకు అందించాడు. దీంతో ఫతేబాద్ మహిళా పోలీసు ఇన్ స్పెక్టర్ బిమ్లాదేవి రంగంలోకి దిగి బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 
అత్యాచారానికి గురైన మహిళలను సంప్రదించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాబా రేప్ చేసిన బాధితుల్లో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.

అత్యాచారం, ఐటీ, బెదిరింపు కేసుల్లో నిందితుడైన మాంత్రికుడిపై పోలీసులు వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేవాలయంలోనే తన భార్యపై బాబా అత్యాచారం చేశాడని ఓ బాధిత మహిళ భర్త గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులకు డబ్బు ఇవ్వలేదనే తనపై కేసు పెట్టారని బాబా ఆరోపించారు.

loader