Gujrat, Himachal Election Results : ఘోర పరాజయం.. గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజీనామా

Gujrat and Himachal Pradesh Assembly election Result 2022 Live updates

బిజెపి హేమాహేమీల సొంత రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు(గురువారం) వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంతరాష్ట్రం గుజరాత్, బిజెపి జాతీయాధ్యక్షడు జేపి నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గుజరాత్ లో అధికార బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ వుండగా, హిమాచల్ ప్రదేశ్ బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ వున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

4:42 PM IST

ఘోర పరాజయం.. గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజీనామా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రఘుశర్మ రాజీనామా చేశారు. హస్తం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

3:52 PM IST

హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా

గవర్నర్ కు రాజీనామా లేఖను పంపనున్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు.  కొత్తగా  ఏర్పాటయ్యే  ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.హిమాచల్ ప్రదేశ్ ప్రజల తీర్పును శిరసావహిస్తానని  ఆయన  చెప్పారు. 

3:24 PM IST

గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్ధి ఓటమి

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 150కి పైగా స్థానాల్లో గెలుపొందింది. అటు మార్పు తీసుకొస్తామంటూ బరిలోకి దిగిన ఆప్‌ను గుజరాతీయులు తిరస్కరించారు. ఈ క్రమంలో స్వయంగా ఆ పార్టీ సీఎం అభ్యర్ధి ఇసుదాన్ గఢ్వీ పరాజయం పాలయ్యారు. 

2:44 PM IST

12న గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. 

2:30 PM IST

హిమాచల్‌పై బీజేపీ ఫోకస్.. కాంగ్రెస్ ‘‘క్యాంప్’’ మొదలు

హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అధికారం కోసం బీజేపీ వ్యూహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ పడింది. దీనిలో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఛార్టర్డ్ ఫ్లైట్ రెడీ చేసింది. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యత ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్‌కు అప్పగించింది హైకమాండ్. 

2:09 PM IST

అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జడేజా భార్య.. భారీ మెజార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో సారి అధికారాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. ఇకపోతే.. గుజరాత్‌ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై దాదాపు 61 వేలకు పైగా మెజార్టీతో రివాబా గెలుపొందారు. 

1:31 PM IST

గుజరాత్ లో 150 మార్క్ దాటిన బిజెపి... విక్టరీ ఖాయమే?

గుజరాత్ లో భారీ విజయం దిశగా బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు బిజెపి 157, కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు మూడుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.   

12:25 PM IST

గుజరాత్ లో బిజెపి బోణీ... దాహోద్ లో తొలి విజయం

గుజరాత్ లో బిజెపి బోణీ కొట్టింది. దాహోద్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి  కన్హయ్యలాల్ బాచుబాయ్ కిషోరి 29వేల భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. 
 
11:31 AM IST

హిమాచల్ ప్రదేశ్ లో అధికారం దిశగా కాంగ్రెస్... స్పష్టమైన ఆధిక్యం

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ ఆధిక్యం మ్యాజిక్ ఫిగర్ ను దాడి 38కి చేరుకుంది. బిజెపి కేవలం 27 స్థానాల్లో, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో వున్నారు. 

11:16 AM IST

హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ ఘనవిజయం

హిమాచల్ ప్రదేశ్ లో మొదటి ఫలితం వెలువడింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ 20వేల మెజారిటీతో విజయం సాధించారు. 

11:05 AM IST

గుజరాత్ లో భారీగా పెరిగిన బిజెపి ఓట్ షేర్....

గుజరాత్ లో అధికార బిజెపి మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చింది. గత ఎన్నికల కంటే బిజెపి ఆరుశాతం ఓట్ షేర్ పెంచుకుని 55శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 15 శాతం ఓట్ షేర్ కోల్పోయి 27 శాతానికి పరిమితమయ్యింది. 
 
11:00 AM IST

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం...

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్ 35, బిజెపి 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు నాలుగుచోట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
10:08 AM IST

గుజరాత్ లో బిజెపి 150 స్థానాల్లో ఆధిక్యం...

గుజరాత్ లో బిజెపి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 182 స్థానాల్లో బిజెపి 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

10:03 AM IST

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం...

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం కాంగ్రెస్ 34, బిజెపి 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
9:40 AM IST

గుజరాత్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

గుజరాత్ లో బిజెపి ఏడోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిన 182 స్థానాల్లో బిజెపి 144 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. గుజరాత్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఆప్ చతికిల పడేలా కనిపిస్తోంది.  ఆ పార్టీ కేవలం 8 చోట్ల ఆధిక్యంలో వుంది. 

9:35 AM IST

గుజరాత్ సీఎం భూపేంద్ర ముందంజ

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లొడియ నియోజకవర్గంలో ముందంజలో వున్నారు. 

9:29 AM IST

రవీంద్ర జడేజా భార్య రివాబా ముందంజ...

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్ నగర్ లో ముందంజలో వుంది. 
 
9:20 AM IST

గుజరాత్ లో జిగ్నేష్ మేవాని వెనుకంజ...

గుజరాత్ లోని వడ్గాం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన జిగ్నేష్ మేవాని వెనుకంజలో వున్నారు. 

9:10 AM IST

హిమాచల్ మంత్రి రాజీవ్ వెనుకంజ...

హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి మంత్రి రాజీవ్ సైజాల్ వెనుకంజలో వున్నారు. 

9:03 AM IST

హిమాచల్ లో కాంగ్రెస్ హోరాహోరీ...

హిమాచల్ ప్రదేశ్ లో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇక్కడ బిజెపి 34, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యలో కొనసాగుతున్నాయి. 

8:58 AM IST

గుజరాత్ లో ఆప్ సీఎం అభ్యర్థి ముందంజ

గుజరాత్ లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఇసుధన్ గద్వీ కంబాలియా అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 

8:54 AM IST

హార్దిక్ పటేల్ ముందంజ

గుజరాత్ లోని  విరంగామ్ అసెంబ్లీ స్థానంలో బజెపి అభ్యర్థి హార్దిక్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

8:51 AM IST

హిమాచల్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి వెనుకంజ

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సుఖ్వీందర్ సింగ్ సుఖు వెనుకంజలో వున్నాడు. 

8:46 AM IST

గుజరాత్, హిమాచల్ లో బిజెపి ఆధిక్యం...

గుజరాత్ లో మొత్తం 182 స్థానాల్లో బిజెపి 135, కాంగ్రెస్ 40, ఆప్ ఐదు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 39, కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకయితే ఆప్ పరిస్థితి గుజరాత్ లో దారుణంగా వుంది. 

8:30 AM IST

హిమాచల్ లో బిజెపి, కాంగ్రెస్ మధ్యే పోటీ...

హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ అధికార బిజెపి 19, కాంగ్రెస్ 12 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

8:22 AM IST

గుజరాత్ లో దూసుకుపోతున్న బిజెపి... ఆప్ అట్టర్ ప్లాప్

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇప్పటివరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి దూసుకుపోతోంది. బిజెపి 72, కాంగ్రెస్ 22 స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ కు పోస్టల్ బ్యాలెట్స్ లో తీవ్ర నిరాశ ఎదురయ్యింది. 

8:13 AM IST

ఇరు రాష్ట్రాల్లోనూ బిజెపి ముందంజ...

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అటు గుజరాత్, ఇటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బిజెపి ముందంజలో వుంది. గుజరాత్ లో బిజెపి 24, కాంగ్రెస్ 6, ఆప్ ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నాయి.  ఇక హిమాచల్ లో బిజెపి 7, కాంగ్రెస్ 23 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 

8:05 AM IST

ఓట్లలెక్కింపు షురూ... పోస్టల్ బ్యాలెట్స్ తో ప్రారంభం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్దులతో పాటు కౌంటింగ్ ఏజెంట్స్ చేరుకున్నారు. వారి సమక్షంలోనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 
 
7:40 AM IST

గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ తో రెండు విడతలు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇరురాష్ట్రాల ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక జాతీయ పార్టీగా ఎదగాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ ప్రధాని సొంతరాష్ట్రంలో పాగా వేయాలని, కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలని ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి.  

7:19 AM IST

గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభంకాగా 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. 

4:42 PM IST:

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రఘుశర్మ రాజీనామా చేశారు. హస్తం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

3:52 PM IST:

గవర్నర్ కు రాజీనామా లేఖను పంపనున్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు.  కొత్తగా  ఏర్పాటయ్యే  ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.హిమాచల్ ప్రదేశ్ ప్రజల తీర్పును శిరసావహిస్తానని  ఆయన  చెప్పారు. 

4:39 PM IST:

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 150కి పైగా స్థానాల్లో గెలుపొందింది. అటు మార్పు తీసుకొస్తామంటూ బరిలోకి దిగిన ఆప్‌ను గుజరాతీయులు తిరస్కరించారు. ఈ క్రమంలో స్వయంగా ఆ పార్టీ సీఎం అభ్యర్ధి ఇసుదాన్ గఢ్వీ పరాజయం పాలయ్యారు. 

2:44 PM IST:

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. 

2:30 PM IST:

హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అధికారం కోసం బీజేపీ వ్యూహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ పడింది. దీనిలో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఛార్టర్డ్ ఫ్లైట్ రెడీ చేసింది. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యత ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్‌కు అప్పగించింది హైకమాండ్. 

2:09 PM IST:

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో సారి అధికారాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. ఇకపోతే.. గుజరాత్‌ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై దాదాపు 61 వేలకు పైగా మెజార్టీతో రివాబా గెలుపొందారు. 

1:31 PM IST:

గుజరాత్ లో భారీ విజయం దిశగా బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు బిజెపి 157, కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు మూడుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.   

12:25 PM IST:

గుజరాత్ లో బిజెపి బోణీ కొట్టింది. దాహోద్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి  కన్హయ్యలాల్ బాచుబాయ్ కిషోరి 29వేల భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. 
 
11:31 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ ఆధిక్యం మ్యాజిక్ ఫిగర్ ను దాడి 38కి చేరుకుంది. బిజెపి కేవలం 27 స్థానాల్లో, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో వున్నారు. 

11:16 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో మొదటి ఫలితం వెలువడింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ 20వేల మెజారిటీతో విజయం సాధించారు. 

11:05 AM IST:

గుజరాత్ లో అధికార బిజెపి మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చింది. గత ఎన్నికల కంటే బిజెపి ఆరుశాతం ఓట్ షేర్ పెంచుకుని 55శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 15 శాతం ఓట్ షేర్ కోల్పోయి 27 శాతానికి పరిమితమయ్యింది. 
 
11:00 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్ 35, బిజెపి 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు నాలుగుచోట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
10:08 AM IST:

గుజరాత్ లో బిజెపి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 182 స్థానాల్లో బిజెపి 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

10:03 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం కాంగ్రెస్ 34, బిజెపి 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
9:40 AM IST:

గుజరాత్ లో బిజెపి ఏడోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిన 182 స్థానాల్లో బిజెపి 144 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. గుజరాత్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఆప్ చతికిల పడేలా కనిపిస్తోంది.  ఆ పార్టీ కేవలం 8 చోట్ల ఆధిక్యంలో వుంది. 

9:35 AM IST:

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లొడియ నియోజకవర్గంలో ముందంజలో వున్నారు. 

9:29 AM IST:

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్ నగర్ లో ముందంజలో వుంది. 
 
9:20 AM IST:

గుజరాత్ లోని వడ్గాం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన జిగ్నేష్ మేవాని వెనుకంజలో వున్నారు. 

9:10 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి మంత్రి రాజీవ్ సైజాల్ వెనుకంజలో వున్నారు. 

9:03 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇక్కడ బిజెపి 34, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యలో కొనసాగుతున్నాయి. 

8:58 AM IST:

గుజరాత్ లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఇసుధన్ గద్వీ కంబాలియా అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 

8:54 AM IST:

గుజరాత్ లోని  విరంగామ్ అసెంబ్లీ స్థానంలో బజెపి అభ్యర్థి హార్దిక్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

8:51 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సుఖ్వీందర్ సింగ్ సుఖు వెనుకంజలో వున్నాడు. 

8:46 AM IST:

గుజరాత్ లో మొత్తం 182 స్థానాల్లో బిజెపి 135, కాంగ్రెస్ 40, ఆప్ ఐదు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 39, కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకయితే ఆప్ పరిస్థితి గుజరాత్ లో దారుణంగా వుంది. 

8:30 AM IST:

హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ అధికార బిజెపి 19, కాంగ్రెస్ 12 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

8:22 AM IST:

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇప్పటివరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి దూసుకుపోతోంది. బిజెపి 72, కాంగ్రెస్ 22 స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ కు పోస్టల్ బ్యాలెట్స్ లో తీవ్ర నిరాశ ఎదురయ్యింది. 

8:15 AM IST:

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అటు గుజరాత్, ఇటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బిజెపి ముందంజలో వుంది. గుజరాత్ లో బిజెపి 24, కాంగ్రెస్ 6, ఆప్ ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నాయి.  ఇక హిమాచల్ లో బిజెపి 7, కాంగ్రెస్ 23 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 

8:05 AM IST:

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్దులతో పాటు కౌంటింగ్ ఏజెంట్స్ చేరుకున్నారు. వారి సమక్షంలోనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 
 
7:40 AM IST:

గుజరాత్ తో రెండు విడతలు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇరురాష్ట్రాల ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక జాతీయ పార్టీగా ఎదగాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ ప్రధాని సొంతరాష్ట్రంలో పాగా వేయాలని, కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలని ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి.  

7:19 AM IST: