Asianet News TeluguAsianet News Telugu

యువతిపై పలుమార్లు రేప్, మత మార్పిడి: కొత్త చట్టం కింద తొలి అరెస్టు

కొత్త మత మార్పిడి నిరోధక చట్టం కింద గుజరాత్ లోని వడొదరలో తొలి అరెస్టు జరిగింది. ఓ యువకుడు తన మతాన్ని తప్పుగా చెప్పి యువతిపై అత్యాచారం చేసి, పెళ్లి చేసుకుని, బలవంతం మాతమార్పిడికి పాల్పడ్డాడు.

Gujarat police make first arrest unfer new anti conversion law
Author
Vadodara, First Published Jun 19, 2021, 7:54 AM IST

వడొదర: కొత్త మత మార్పిడి నిరోధక చట్టం కింద గుజరాత్ పోలీసులు తొలి అరెస్టు చేశారు. 26 ఏళ్ల యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి, పెళ్లి చేసుకుని, బలవంతం మత మార్పిడికి పాల్పడిన 26 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని వడొదరలో ఈ సంఘటన జరిగింది. 

వడొదర నగరానికి చెందిన 26 ఏళ్ల సమీర్ ఖురేషి అనే యువకుడు తాను క్రైస్తవుడిని అంటూ ఓ యువతిని ఇన్ స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసకి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో సమీర్ ఖురేషిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఖురేష్ తనపై పలుమార్లు అత్యాచారం చేసి, ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడని యువతి ఆరోపించింది. దాంతో వడదొరలోని గోత్రి పోలీసులు నిందితుడు సమీర్ ఖురేష్ మీద గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ చట్టం 2021 ప్రకారం కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. ఆ చట్టం కింద వివాహం చేసుకుని బలవంతం మతమార్పిడికి పాల్పడితే కఠినమైన శిక్ష విధిస్తారు. 

తాను క్రైస్తవుడిని అని, తన పేరు సామ్ మార్టిన్ అని యువతిని తప్పుడు గుర్తింపుతో పరిచయం చేసుకుని యువతిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. యుతిని హోటల్ కు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, తనకు సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు.

యువతి రెండు సార్లు గర్భం దాల్చిందని, గర్భస్రావం చేయించాడని కూడా తేలింది. పెళ్లి సమయంలో నిఖా వేడుక నిర్వహించడంతో అసలు విషయం తెలిసిందని యువతి పోలీసులకు చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios