గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో  స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న మహిళల ఫోటోలు తీసిన  ఆకాష్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆకాష్ పటేల్‌ ఇంటికి సమీపంలోనే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది.

ఈ స్విమ్మింగ్ పూల్‌లో మహిళలు ఈత కొట్టేందుకు వచ్చేవారు. సోమవారం నాడు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న మహిళలను ఆశోక్ పటేల్ తన మొబైల్‌ ఫోన్‌లో
రికార్డు చేశాడు.  ఈ విషయాన్ని గమనించిన మహిళలు ఫోటోలు తీయకూడదని హెచ్చరించారు. 

ఫోటోలు తీయవద్దని హెచ్చరించినందుకు గాను మహిళలను ఆకాష్ పటేల్ దూషించాడు.  దీంతో ఓ మహిళ ఆకాష్ పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తీసుకొన్నారు.