గాంధీనగర్: గుజారాత్‌ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై  బీజేపీ ఎమ్మెల్యే బాధిత మహిళకు క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు.

 

 

 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  నీత్ తేజ్‌వానీ అనే మహిళపై బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ దాడికి పాల్పడ్డాడు. గుజరాత్ రాష్ట్రంలోని నరోడాలో మంచినీటి సరఫరా విషయమై నిరసన వ్యక్తం చేస్తోంది.

ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే బలరాం తో  మాట్లాడేందుకు తాను  వెళ్లిన సమయంలో దాడి జరిగినట్టుగా బాధితురాలు చెప్పింది.ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లగానే  ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఎమ్మెల్యే కూడ తనపై దాడికి పాల్పడినట్టుగా ఆమె ఆరోపించారు.

 

ఈ విషయాన్ని గుర్తించిన తన భర్త తనను రక్షించేందుకు వచ్చారు. అయితే తన భర్తపై కూడ ఎమ్మెల్యే బలరామ్ మనుషులు దాడులకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బలరామ్ దిగొచ్చారు. ఈ విషయంలో తప్పు జరిగిందన్నారు.ఈ దాడి ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదన్నారు. 

తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదన్నారు. బాధితురాలిపై దాడికి పాల్పడినందుకు గాను క్షమాపణలు చెప్పారు.ఈ ఘటనపై అధికార పార్టీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.