Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై డెలివరీ ఏజెంట్ లైంగికదాడి

ఓ యాప్ ద్వారా ఇంటి సరుకుల కోసం ఓ మహిళ ఆర్డర్ చేసింది. డెలివరీ ఏజెంట్ వాటిని తీసుకుని వచ్చి ఆమె ఒంటరిగా ఉన్నదని గుర్తించి లోపలికి చొచ్చుకెళ్లి రేప్ చేశాడు.
 

groceries delivery agent rapes woman after she was alone in the home in noida kms
Author
First Published Oct 29, 2023, 3:45 PM IST | Last Updated Oct 29, 2023, 3:45 PM IST

న్యూఢిల్లీ: ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నది. నోయిడాలోని హైరైజ్ బిల్డింగ్‌లో నివాసం. సరుకుల కోసం స్వయంగా వెళ్లే నిర్ణయం పక్కన పెట్టి మొబైల్ ఫోన్ తీసి యాప్‌లో సరుకులను ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి 23 ఏళ్ల సుమిత్ సింగ్‌కు ఆ యాప్ కంపెనీ బాధ్యత అప్పజెప్పింది. సరుకులు పట్టుకుని ఆమె ఇంటికి వెళ్లుతుండగానే ఆమె ఇంట్లో ఒక్కరే ఉన్నారని గ్రహించాడు.

తీరా అడ్రస్‌కు వెళ్లిన తర్వాత సరుకులతో ఆమె ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకుని వెళ్లాడు. ఆమె ఒంటరిగానే ఉన్నదని ధ్రువీకరించుకున్న తర్వాత ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. ఆమె దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది.

పోలీసులు వెంటనే పలు బృందాలుగా ఏర్పడి సుమిత్ సింగ్ కోసం గాలింపులు మొదలు పెట్టింది. సుమిత్ గ్రేటర్ నోయిడాలోని రెసిడెన్షియల్ ఏరియాలో దొరికాడు. పోలీసులు సుమిత్‌ను అరెస్టు చేయడానికి సమీపించగానే ఓ కానిస్టేబుల్ నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు.

Also Read: Kerala Blast: టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు, ఉదయం 9.40 గంటలకు మొదటి పేలుడు!

దీంతో రీఎన్‌ఫోర్స్‌మెంట్, స్వాట్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆ ఏరియాను జల్లెడపట్టాయి. సుమిత్ దాక్కున్న ఏరియాకు పోలీసులు సమీపించగానే వారిపైకి సుమిత్ కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ బుల్లెట్ సుమిత్ కాలులోకి దూసుకెళ్లింది. వెంటనే సుమిత్‌ను అరెస్టు చేసి ఓ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్చారు. గతంలో అక్రమ మద్యాన్ని అమ్ముతూ అరెస్టయిన చరిత్ర సుమిత్‌కు ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios