Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై

గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై ఈరోజు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో  కోవీషీల్ద్  వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. 

governor tamilisai soundararajan takes covishield vaccine in puducherry- bsb
Author
Hyderabad, First Published Apr 2, 2021, 2:49 PM IST

గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై ఈరోజు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో  కోవీషీల్ద్  వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. 

వ్యాక్సిన్ తీసుకోవడం గర్వంగా ఉందని, అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ రహిత భారత్ గా మన దేశాన్ని తీర్చిదిద్దాలని కోరారు. పుదుచ్చేరిలో ఈరోజు మహిళలకు ప్రత్యేకమైన కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ని లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో డాక్టర్ తమిళిసై ప్రారంభించారు. 

ఈ సందర్భంగానే తను కూడా మొదటి డోసు తీసుకున్నారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా ఉందని,  వ్యాక్సిన్ అభివృద్ధి,  తయారీ, పంపిణీలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని గవర్నర్ అన్నారు. 

కోవిడ్ నివారణకి వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు, సరైన నివారణ జాగ్రత్తలు పాటించడం కూడా అత్యంత ఆవశ్యం అని గవర్నర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios