ఎంబ్రాయిడరీ చాటున.. బంగారాన్ని జాకెట్లో దాచి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 4, Sep 2018, 11:50 AM IST
gold smuggling in chennai airport
Highlights

భారత్‌లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎంతగా కఠినంగా ఉంటున్నా స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి రప్పిస్తున్నారు

భారత్‌లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎంతగా కఠినంగా ఉంటున్నా స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి రప్పిస్తున్నారు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ఆయుభ్‌ఖాన్ నిన్న రాత్రి కువైట్ నుంచి ఓమన్ ఎయిర్‌లైన్స్‌లో చెన్నైకి చేరుకుని.. గ్రీన్ ఛానెల్ మార్గంలో బయటకు వెళ్తున్నాడు..

అతనికి స్వాగతం పలికేందుకు ముస్తఫా అనే యువకుడు వేచి ఉన్నాడు. అయితే ఆయుబ్ ఖాన్‌ను కస్టమ్స్ అధికారులు మరోసారి లోపలికి పిలవగా.. అందుకు నిరాకరించడమే కాకుండా.. ఎన్నిసార్లు తనిఖీలు చేయించుకోవాలంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అతని ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది.

అయుబ్ ఖాన్ సూట్‌కేసును తెరిచి చూడగా.. అందులో మూడు జాకెట్లు ఉన్నాయి. వాటికున్న ఎంబ్రాయిడరీ డిజైన్ తొలగించి చూడగా...చిన్న చిన్న ముక్కలుగా బంగారం దొరికింది. అలాగే ఓ వంట వస్తువు పేరుతో ఉన్న ప్యాకెట్‌లో బంగారు కమ్మీలు లభించాయి.. మొత్తం 500 గ్రాముల బంగారం దొరికిందని.. దీని విలువ రూ.15 లక్షల పైన ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయుబ్ ఖాన్, ముస్తఫాలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

loader