భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికను కారులో కిడ్నాప్ చేసి, అందులో ఒకడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో గల గోవిందపురా బిహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో జరిగింది. లాక్ డౌన్ సమయంలో భోపాల్ లో జరిగిన రెండో అత్యాచారం ఘటన ఇది.

జేపీ ఆస్పత్రికి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లిన కారు జేపీ ఆస్పత్రికి, గోవిందపురకు మధ్య చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ కారును నిలువరించలేదు. ఆస్పత్రి గేటు వద్ద ఈ నెల 18వ తేదీన అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లారు. కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఆ తర్వాత ఆమెను మయూరు పార్కు వద్ద వదిలి వెళ్లారు. ఎవరికైనా విషయం చెప్తే చంపేస్తామి బెదిరించారు. తీవ్ర భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని రహస్యంగానే ఉంచింది. అయితే, ఫ్రెండ్ నచ్చజెప్పడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  షఫీక్ ఖాన్, అతని మిత్రుడు అబిద్ ఖాన్ తనపై దాష్టికానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది.