నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన జులై 23వ తేదీన గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీసు స్టేషన్ పరిధిలో చేటు చోసుకుంది. 

నిందితులిద్దరపై అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 14 బాలిక తన ఇంటికి కొద్ది దూరంలో ఇళ్లలో పాలు పోసి తిరిగి వస్తుండగా, ఇద్దరు యువకులు ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశంలో పట్టుకున్నారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల వయస్సు దాదాపు 20 ఏళ్లు ఉంటుంది. 

బాలిక కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తన్నారు.  బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.