ఉపాధి కోసం ఓ బాలిక నగరానికి చేరింది. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు మాయ మాటలు చెప్పారు. వారు చెప్పిన మాటలు సదరు బాలిక నిజమని నమ్మింది. అదే అదనుగా చేసుకొని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దానిని వీడియోతీసి.. అది చూపించి సంవత్సరం పాటుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దళిత మైనర్ బాలిక(17)ను ఇద్దరు కామాంధులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగుచూసింది. ఉపాధి కోసం నోయిడాకి వచ్చిన అక్కాచెల్లెళ్లు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన చాండ్ అలిచాస్ ముర్సాలిన్, షాన్ అలియాస్ సోను పదిహేడేళ్ల ఆ బాలికపై కన్నేశారు. అదను చూసి బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ఆమె మత్తులోకి జారుకున్నాక కీచకపర్వానికి తెరలేపారు.

ఆమెను రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో తీశారు. ఆ వీడియో చూపించి సంవత్సరం పాటు దారుణానికి పాల్పడ్డారు. కాగా.. ఇటీవల కరోనా లాక్ డౌన్ తో బాలిక తన స్వస్థలానికి  వెళ్లడంతో.. సదరు వీడియోని  వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసేశారు. దీంతో ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులనూ పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్ రేప్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు.