బెంగళూరు: బెంగళూరులోని తన ఇంటి యజమాని ఇల్లు ఊడుస్తూ 16 ఏళ్ల బాలిక బిడ్డను ప్రసవించింది. ఒడిశాలో తనపై 2019 ప్రారంభంలో సామూహిక అత్యాచారం జరిగిందని, 2019 నవంబర్ లో ప్రసవం జరిగినట్లు బాలిక దర్యాప్తు అధికారులకు చెప్పింది.

యజమాని ఇల్లు ఊడుస్తూ బాలిక అకస్మాత్తుగా రక్తమడుగులో కనిపించింది. అప్పటికప్పుడు ఆమెకు ప్రసవం జరిగింది. ఆమెను, ఆమె బిడ్డను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక వెల్లడించింది. 

ఆ విషయాన్ని జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసీ) తెలియజేశారు. పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. నిరక్షరాస్యులైన బాలిక ఒడిశాలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత తాను బెంగళూరు వచ్చానని, తన కజిన్స్ తో కలిసి ఉంటున్నానని, వారు కూడా ఇళ్లలో పని చేస్తూ ఉంటారని ఆమె చెప్పింది.

సిడబ్ల్యూసీ బాలికను, ఆమె బిడ్డను ఎన్జీవోకు అప్పగించారు. ఎన్జీవో ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను సంప్రదించి వారికి అప్పగించారు. తన బిడ్డను 2020 జనవరిలో ఆమె తనతో పాటు తీసుకుని వెళ్లింది. గర్భం దాల్చిన ఛాయలు ఏమీ కనిపించలేదని, ఆమె ప్రసవం దిగ్భ్రాంతి కలిగించిందని కమిటీ సభ్యులు అంటున్నారు. 

మైనర్ ను పనిలో పెట్టుకున్నందుకు బెంగళూరు దంపతులు కూడా చిక్కులు ఎదుర్కుంటున్నారు. ఆమెను పనిలో పెట్టుకున్నవారికి కూడా ఆమె గర్భం దాల్చిన విషయం తెలియదని, బరువు పెరుగుతుందని అనుకున్నారే తప్ప గర్భం దాల్చడాన్ని పసిగట్టలేకపోయారని అంటున్నారు. బెంగళూరులో పనికి కుదిరిన తర్వాత మంచి ఆహారం లభించడంతో బరువు పెరుగుతోందని మాత్రమే అనుకున్నారు.